E-Paper
Advertisement

Hyderabad BRS | బీఆర్ఎస్ పరువు కాపాడిన హైదరాబాద్ ఓటర్!

Hyderabad BRS | ఒకప్పుడు హైదరాబాద్‌లో జెండా స్తంభం కూడా లేదు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. ఇప్పుడదే హైదరాబాద్‌ ఆ పార్టీకి దిక్కయింది. పార్టీ పరువు నిలబెట్టింది. ఎన్నికల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని మరోసారి రుజువైంది.

Hyderabad BRS | బీఆర్ఎస్ పరువు కాపాడిన హైదరాబాద్ ఓటర్!
Advertisement

Hyderabad BRS | ఒకప్పుడు హైదరాబాద్‌లో జెండా స్తంభం కూడా లేదు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. ఇప్పుడదే హైదరాబాద్‌ ఆ పార్టీకి దిక్కయింది. పార్టీ పరువు నిలబెట్టింది. ఎన్నికల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని మరోసారి రుజువైంది.

తెలంగాణలో బీఆర్ఎస్ పరువు నిలిపిన ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్. మహానగరంలో గులాబీ జెండాకు ఓటర్లు జై కొట్టారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో పాతబస్తీలో మజ్లిస్ సత్తా చాటగా.. ఆ తర్వాత ఆధిపత్యం బీఆర్ఎస్‌ది. రంగారెడ్డి జిల్లా పరిధిలోను అంతే. ఈ మాత్రం గ్రేటర్ సపోర్టు లభించకుంటే.. కారు మరింత డ్యామేజ్ అయ్యేది. కేసీఆర్ పరువు మురికి మూసీలో కలిసేదే.

Advertisement

హైదరాబాద్ ఓటర్లు విలక్షణం. నాడి పట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది మినీ భారత్. ఒకవైపు ఉన్నత విద్యావంతులు, టెక్కీలు.. మరోవైపు పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చిన వలసజీవులు.. ఇంకోవైపు ఎప్పటినుంచో భాగ్యనగరంలో నివసిస్తున్న సిటిజన్లు. ఒక్కొక్కరి ఆకాంక్షలు ఒక్కోలా ఉంటాయి. ఒక్కో జోన్‌లో ఒక్కో మనస్తత్వం ఉంటుంది. అలాంటి చోట బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించింది.

మరి, తెలంగాణ మొత్తం సత్తా చాటిన కాంగ్రెస్, హైదరాబాద్‌లో ఎందుకు డీలా పడింది? మది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇందుకు సమాధానం క్లియర్. భాగ్యనగరంలో గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లోకి వెళ్లాక.. మైనార్టీ ఓట్లు చేతి నుంచి చేజారాయనే చెప్పాలి. నాయకత్వ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇది ప్రతిఫలించింది. కేడర్ ఉన్నా.. కాంగ్రెస్ జెండా మోసే నాయకుడు కరువయ్యాడు. పారాచ్యూట్ లీడర్లే దిక్కయ్యారు. ఆ ప్రభావం ఫలితాలపై స్పష్టంగా పడిందనే చెప్పాలి.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×