BigTV English

Rajasthan MP Chhattisgarh Poll results | రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల తుది ఫలితాలు

Rajasthan MP Chhattisgarh Poll results | రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల తుది ఫలితాలు

Rajasthan MP Chhattisgarh Poll results | రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ మూడు రాష్ట్రాలలోనూ బిజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు చెప్పినా.. ఎన్నికల ఫలితాలలో బిజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి గెలుపొందింది. ఇక ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌లో బిజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. అలాంటి పోటీ లేకుండానే రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో బిజేపీ సునాయసంగా విజయం సాధించింది.


రాజస్థాన్‌లో బిజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరా రాజే 57 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 199 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బిజేపీ అత్యధికంగా 115 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 70 స్ధానాలకే పరిమితమైంది.

రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు


బిజేపీ – 114
కాంగ్రెస్ – 70
ఇతరులు-14

ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. మొత్తం 230 సీట్లలో 229 స్థానా్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజేపీ 163 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 స్థానాల్లోనే విజయం సాధించింది.

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

బిజేపీ – 163
కాంగ్రెస్ – 66
ఇతరులు- 01

చివరగా ఛత్తీస్ గఢ్‌లో బిజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. ఛత్తీస్ గఢ్‌ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లున్నాయి. ఇందులో బిజేపీ 54 స్థానాల్లో గెలిచి మేజిక్ ఫిగర్ 45 కంటే 9 సీట్లు ఎక్కువే సాధించిందని చెప్పాలి. కాంగ్రెస్ 35 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఛత్తీస్ గఢ్‌ ఎన్నికల ఫలితాలు

బిజేపీ – 54
కాంగ్రెస్ – 35
ఇతరులు- 01

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×