E-Paper
Advertisement

BRS Exit Polls | బిఆర్ఎస్ మంత్రుల ఓటమి ఖాయం? ఏమిటా కారణాలు?

BRS Exit Polls | ఎగ్జిట్ పోల్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రగతి భవన్ పరేషాన్ లో ఉంది. తెలంగాణ భవన్ లో సందడి మాయమైంది. ఇక కేసీఆర్ క్యాబినెట్ లో చాలా మంది మంత్రుల ఓటమి ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ను అంచనా వేసిన తర్వాత మంత్రుల్లో ఒకరిద్దరు గెలిస్తే మహా గొప్ప అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరు ఇంటికి.. ఎవరు అసెంబ్లీకి?

BRS Exit Polls | బిఆర్ఎస్ మంత్రుల ఓటమి ఖాయం? ఏమిటా కారణాలు?
Advertisement

BRS Exit Polls | ఎగ్జిట్ పోల్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రగతి భవన్ పరేషాన్ లో ఉంది. తెలంగాణ భవన్ లో సందడి మాయమైంది. ఇక కేసీఆర్ క్యాబినెట్ లో చాలా మంది మంత్రుల ఓటమి ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ను అంచనా వేసిన తర్వాత మంత్రుల్లో ఒకరిద్దరు గెలిస్తే మహా గొప్ప అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరు ఇంటికి.. ఎవరు అసెంబ్లీకి?

ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చేశాయి. కాంగ్రెస్ దే విజయమని తేలిపోయింది. మరి హస్తవాసి ఆ రేంజ్ లో ఉంటే.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారి పరిస్థితి బాగుంటుందా? ఏమాత్రం బాగోలేదని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి సీఎం కేసీఆర్ సిచ్యువేషన్ కామారెడ్డి, గజ్వేల్ లో ఏమంత బాగోలేదంటున్నారు. ఇక మంత్రుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరూ బయటకు రావడం లేదు. మంత్రుల శిబిరాలన్నీ సైలెంట్ అయ్యాయి. నిజానికి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ రోజు ఎక్కడికి వెళ్లినా వారికి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఓటమి ఖాయమని ముందుగానే తెలిసిపోయిందంటున్నారు.

Advertisement

ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేసిన 20 సంస్థల్లో 17సంస్థలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. దీంతో మంత్రులు అసలు గెలిచే పరిస్థితి ఉందా లేదా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారిపోయింది. మంత్రివర్గంలో చాలామంది మంత్రులు ఓడిపోతారు అన్న టాక్ ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారుతోంది. మొత్తం కేసీఆర్ క్యాబినెట్ లో ఇద్దరు ముగ్గురు గెలిస్తే మహా ఎక్కువ అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది.

కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క హరీష్ రావుదే కొంత గ్యారెంటీ కనిపిస్తోందంటున్నారు. మరో ఇద్దరు గెలిచే పరిస్థితి ఉన్నా నెక్ టూ నెక్ పోరులో ఏదైనా జరగొచ్చంటున్నారు. రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్ ఆ రెండింట్లో ఎదురీదడం ఖాయమంటున్నారు. అటు కేటీఆర్ కూడా సిరిసిల్లలో గెలుపు గ్యారెంటీ లేకుండాపోయింది. పోలింగ్ కు ముందు కేటీఆర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ కాల్ రికార్డ్ ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఓటమి ఖాయం, మెజార్టీ బాగా తగ్గుతుందన్న మౌత్ టాక్ సిరిసిల్లలో సంచలనంగా మారింది. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ అందరినీ సముదాయించారు. అయితే ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా జనంలో ఉండాలన్నది తనకు అర్థమైందని చెప్పడం గెలుపుపై ధీమాగా లేరన్న విషయాన్నే స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా అదే నడుస్తోంది.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు చాలా మంది ఓటమి పాలవుతారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఓటమిపాలవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చాలామంది మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని అడ్డుకున్న పరిస్థితులు, ప్రజలు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితును బట్టి ఓటమి ఖాయమన్న అంచనాలకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్న మంత్రులు ప్రజల వ్యతిరేకతను తగ్గించి తమవైపు సానుకూలంగా మార్చుకోలేకపోయారంటున్నారు.

కొన్ని నియోజకవర్గాలలో మంత్రులకు అపోనెంట్ గా బలమైన నేతలు ప్రత్యర్థులుగా ఉన్నారు. అక్కడ మినిస్టర్లు ఎలాగూ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణ కరీంనగర్ స్థానంలో మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ నుంచి బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ నిలిచారు. ఇంతటి బలమైన ప్రత్యర్థులను తట్టుకుని, కేసీఆర్ వ్యతిరేకతను తగ్గించుకుని గంగుల గెలిచే పరిస్థితి అసలే లేదంటున్నారు. అటు నిర్మల్ లోనూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు ఇలా బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయంటున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలు లేకపోయినప్పటికీ… రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో మంత్రులు మాత్రం గెలిచే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×