E-Paper
Advertisement

Telangana Elections | ఉత్కంఠంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!

Telangana Elections | అంతటా ఉత్కంఠ కలిగిస్తున్న తెలంగాణ కౌంటింగ్ ఆదివారం జరగనుంది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం పది గంటలకే ఫస్ట్ రౌండ్ ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని చెబుతుండగా.. ఎగ్జాక్ట్ పోల్స్ తమకు శుభవార్త ఇస్తాయని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. ఇంకోవైపు ప్రగతి భవన్ ఖాళీ చేసే పనులు వేగం పుంజుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Telangana Elections | ఉత్కంఠంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!
Advertisement

Telangana Elections | అంతటా ఉత్కంఠ కలిగిస్తున్న తెలంగాణ కౌంటింగ్ ఆదివారం జరగనుంది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం పది గంటలకే ఫస్ట్ రౌండ్ ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని చెబుతుండగా.. ఎగ్జాక్ట్ పోల్స్ తమకు శుభవార్త ఇస్తాయని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. ఇంకోవైపు ప్రగతి భవన్ ఖాళీ చేసే పనులు వేగం పుంజుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందోనన్న హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే తమ విజయం నల్లేరుపై నడకే అని బీఆర్ఎస్ అనుకుంటోంది. అవన్నీ దింపుడు కళ్లెం ఆశలే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తెలంగాణలో మొత్తం 49 సెంటర్లలో ఓట్లు లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తే.. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంల సీల్స్ ఓపెన్ చేస్తారు. దీంతో వెంటవెంటనే ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండనుంది. టగ్ ఆఫ్ వార్ ఉండే చోట్ల కౌంటింగ్ కీలకంగా మారబోతోంది. మరికొద్ది గంటల్లోనే ఎవరు విజేత.. ఎవరు పరాజితులో తేలనుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్ ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోనున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. గతంలో మాదిరి కాకుండా టఫ్ ఫైట్ ఉండడంతో హైటెన్షన్ కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను కర్ణాటక డిప్యూటీ సీఎం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కౌంటింగ్ ముగిసే వరకు అంటే సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే జై కొట్టడంతో ఆ పార్టీ మరింత అలర్ట్ అవుతోంది. పోటీ చేసిన అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు. మొత్తం ప్రక్రియ అంతా వారే మానిటరింగ్ చేయనున్నారు. గెలిచాక సర్టిఫికెట్ తీసుకునే వరకు దగ్గరుంటారు.

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ కూడా తమదే విజయమంటూ మాట్లాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్పినా కంగారు వద్దని కేసీఆర్ ఇప్పటికే నేతలకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. గెలుపు గులాబీదే అనుకుంటున్నారు. తన కేడర్ ఎక్కడ చేజారి పోతుందన్న అభద్రతా భావం బీఆర్‌ఎస్‌ అధిష్టానంలో మొదలైందంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో అలర్ట్ అవుతున్నారు.

అయితే ప్రగతి భవన్ నుంచి సామాన్ అంతా తరలించే పనిలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నోట్ల కట్టలు కూడా ఫాంహౌజ్ వెళ్తున్నాయని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అటు అధికారం కోల్పోతున్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ పేర్లు మార్చి ధరణిలో వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి అంటున్నారు. పైగా అభివృద్ధి పనులు పూర్తికాక ముందే సన్నిహితులైన కాంట్రాక్టర్లకు ముందస్తుగా బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో నేతలు, కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలంటున్నారు.

మరోవైపు నాలుగోతేదీన కేబినెట్ మీటింగ్, నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. అటు మరికొద్ది గంటల్లో కౌంటింగ్ జరగనుండడం, గెలుపెవరిదో తేలిపోనుండడంతో బెట్టింగ్ లు కూడా జోరందుకున్నాయి. ఏపీ, తెలంగాణలో జోరుగా పందాలు కాస్తున్నారు. సండే కౌంటింగ్ డే కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలులో ఉండనుంది. మద్యం షాపులు కూడా బంద్ చేయనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×