E-Paper
Advertisement

KTR :బీఆర్ఎస్ టు టీఆర్ఎస్.. పాజిబుల్ అవుతుందా?

KTR :బీఆర్ఎస్ టు టీఆర్ఎస్.. పాజిబుల్ అవుతుందా?
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత పార్టీ పేరు మార్పుపై నిన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటి వద్ద మీడియా చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అలా ఎందుకు మాట్లాడి ఉంటారని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. గతంలో తెలంగాణను ఓన్ చేసుకున్న పార్టీగా టీఆర్ఎస్‌కు ఒక గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారో అప్పుడే పార్టీ ప్రజలకు దూరం అయ్యిందనే చర్చ మొదలైంది.ప్రత్యేక తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎనలేని గుర్తింపు వచ్చింది.రాష్ట్ర సాధన కోసమే ఉద్యమనాయకుడు కేసీఆర్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారని, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని విశ్లేషకులు చెబుతారు.సకల జనుల సమ్మె ఉధృతం కావడం వెనుక గులాబీ దళపతి, ఆపార్టీ కృషి ఉందనడం కాదనలేని సత్యం.

కేసీఆర్ నిరాహార దీక్షతో ఆజ్యం..

తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాక క్రమంగా ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అందుకు మేధావులు,ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఎంతగానో మద్దతు పలికారు. ఉద్యమకారుల బలిదానాలు అందుకు ఆజ్యం పోశాయి. శ్రీకాంతచారి ఆత్మాహుతితో మొదలై సుమారు వెయ్యికి పైగానే ఉద్యమకారులు ఆత్మాహుతికి పాల్పడటంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్.అందుకే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్‌కు అధికారం కట్టబెట్టారు. ప్రజల తరఫున రాష్ట్రానికి కాపాలదారుడిగా ఉంటానన్న మాటలు ప్రజలను పార్టీకి మరింత దగ్గరచేశాయి.దీంతో ఉద్యమనేత తెలంగాణకు తొలి సీఎం అయ్యారు.

ప్రజలకు పార్టీకి దూరం పెరిగిందా?

Advertisement

కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక ఆయన ప్రెస్ మీట్స్ పెట్టడం తగ్గిపోయింది. కాస్త ప్రజలకు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ప్రగతి భవన్ లేదా ఫాంహౌస్ నుంచే కేసీఆర్ పాలన సాగింది. సెక్రటేరియట్ కట్టించినా ఆయన అక్కడకు రాలేదు. ప్రగతి భవన్‌లో సామాన్యుడికి ఎంట్రీలేదు. ఒక్కోసారి మంత్రులకు సైతం అపాయింట్ మెంట్ దొరికేది కాదు. కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుతో ప్రజల్లో పార్టీ మీద అసంతృప్తి జ్వాలలు రగిలాయి. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను పట్టించుకోలేదు.. పార్టీ పేరు మార్పుతో ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టు అయ్యింది. ప్రతిపక్షాలు సైతం ఇక మీదట బీఆర్ఎస్ ఉద్యమపార్టీ కాదని ప్రచారం చేశారు.ఇదే విషయాన్ని నిన్న కేటీఆర్ గుర్తుచేశారు.

మసాలా దట్టించి వండిన ఈ గుత్తి వంకాయ ముందు చికెన్, మటన్ కూడా బలాదూరే!

Advertisement

బీఆర్ఎస్ అని పేరు మార్పు చేసి తప్పు చేశామని అన్నారు. ప్రజలు సైతం బీఆర్ఎస్‌ను తీసుకోలేకపోతున్నారని, చాలామంది టీఆర్ఎస్‌గా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పార్టీ పేరు మార్పుపై అప్డేట్ ఇస్తానని చెప్పారు. కాగా, పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా.. మరల టీఆర్ఎస్ అనే పేరు, సేమ్ పార్టీ గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు, కారు గుర్తు ఇతరులకు కేటాయించకపోతే దానిని ఈసీ త్వరగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. గతంలో పార్టీ ఓటమికి పేరు మార్పు కూడా ఓ కారణమని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఓ సందర్భంలో గుర్తుచేసిన విషయం తెలిసిందే. ఒకవేళ టీఆర్ఎస్‌ పార్టీ పేరు మారినా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సందిగ్దత నెలకొన్నది.

 

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×