E-Paper
Advertisement

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం
Advertisement

Peddi Sudarshan Reddy Passes Away :  తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, గులాబీ పార్టీ ( BRS) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  ( Peddi Sudarshan Reddy) మృతి చెందారు. గురువారం అర్థరాత్రి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. గత ఆదివారం గుండెపోటు రావడంతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి సుదర్శన్ రెడ్డిని తరలించారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి మ‌రీ, య‌శోద‌కు తీసుకెళ్లారు.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

నింగికెగిసిన ఉద్యమ కెరటం

Advertisement

ఈ క్ర‌మంలో ఐదు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్థరాత్రి మృతి చెందారు. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, కేసీఆర్ వెంటే ఉంటూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2018లో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలై, నిత్యం ప్ర‌జాక్షేత్రంలో ఉంటున్నారు. కానీ అంత‌లోనే ఆయ‌న మృతి చెందారు.

BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజ‌కీయ నేప‌థ్యం

గులాబీ పార్టీలో సీనియర్ లీడర్ గా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి… తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి… తన సొంత గ్రామంలో యూత్ క్లబ్ ఏర్పాటుతో, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ముందుగా మండల స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి.. 2001లో TRS పార్టీలో చేరారు.

Advertisement

కెసిఆర్ పార్టీ పెట్టగానే… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి… ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఆయన ఎదుర్కొన్నారు. ఎక్కడా తగ్గలేదు. 2001 సంవ‌త్స‌రంలోనే నల్లబెల్లి జడ్పిటిసిగా విజయం సాధించారు. అదే సమయంలో వరంగల్ జిల్లా జడ్పీ టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ… 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలోనే తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు.

కెసిఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూనే పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పనిచేశారు. ఓడిపోయిన‌ప్ప‌టికీ, నిత్యంలో ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, న‌ర్సంపేట‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా, పెద్దినే గెలుస్తార‌ని ఓ స‌ర్వే కూడా వెల్ల‌డించింది.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.  ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుణ్ని కోల్పోయానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.

నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీతోపాటు డాక్టర్లు తీవ్ర కృషి చేశారన్నారు. పెద్దిని కోల్పోయిన ఆయన కుటుంబసభ్యులకు  పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

 

 

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×