Revanth Reddy: వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నేడు గణపతి పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. అనంతరం తెంగాణ ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు కలగాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
వినాయక పూజాంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో నిరంతంరం వెలుగులు నింపాలని ఆ దేవున్ని కోరుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరి బాధలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు, సకల విజయాలు కలగాలని ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని వేడుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also read: అంతరిక్షంలో ‘ఫుట్‌బాల్’.. బంతితో చెడుగుడు ఆడిన వ్యోమగాములు.. అదరగొట్టారు భయ్యా!
సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజాకార్యక్రమంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్, దంపతులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ప్రజలకు పంటలు బాగా పండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఉన్నతాదికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also read: ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!