E-Paper
Advertisement

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా
Advertisement

Hollywood Action Drama: రాబిన్ హుడ్ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది పేదలకు సాయం చేసే ధైర్యవంతుడు, అడవుల్లో గుర్రంపై తిరుగుతూ అన్యాయానికి ఎదురు నిలిచే హీరో. కానీ ఆ కథలన్నీ ఆయన యవ్వనంలో చేసిన సాహసాల గురించే. మరి ఆ గొప్ప యోధుడు వృద్ధాప్యంలో ఎలా ఉన్నాడు ? ఎన్నో యుద్ధాలు చేసి అలసిపోయిన తర్వాత అతని జీవితం ఎలా ముగిసింది ? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నమే The Death of Robin Hood. హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్‌మన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా… యాక్షన్‌తో పాటు గుండెల్ని తాకే భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత రాబిన్ హుడ్ కథకు పూర్తిగా భిన్నమైన కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి దీన్ని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఎన్నో సంవత్సరాల పాటు అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడిన రాబిన్ హుడ్ ఇప్పుడు వృద్ధాప్యంలోకి అడుగు పెడతాడు. గతంలో జరిగిన యుద్ధాలు, పోరాటాల వల్ల తీవ్ర గాయాలతో శారీరకంగా బలహీన పడిపోతాడు. జీవితం చివరి దశకు చేరుకున్న సమయంలో అతనికి ఒక రహస్యమైన ప్రదేశంలో ఆశ్రయం లభిస్తుంది. అక్కడ నివసించే ఒక సాధ్వి అతనికి చికిత్స చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

అయితే శరీరం సహకరించకపోయినా… మనసు మాత్రం ఇంకా పోరాటానికే సిద్ధంగా ఉంటుంది. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేని రాబిన్ హుడ్, జీవితంలో చివరిసారిగా ఒక ప్రమాదకరమైన మిషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. అది కేవలం ఒక పోరాటం కాదు… తన జీవితానికి అర్థం చెప్పే చివరి ప్రయాణం.

ఈ ప్రయాణంలో అతను ఎలాంటి శత్రువులను ఎదుర్కొన్నాడు ? చివరి వరకు తన సిద్ధాంతాలను కాపాడుకోగలిగాడా ? అతని జీవితానికి ఎలాంటి ముగింపు దక్కింది ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. అయితే అసలు క్లైమాక్స్ ఎలా ఉంటుందో, రాబిన్ హుడ్ చివరి నిర్ణయం ఏంటో మాత్రం ముందే చెప్పకుండా దర్శకుడు కథను చాలా ఎమోషనల్‌గా నడిపించాడు.

తెలుగులో లేదు

Advertisement

ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. అయితే ఇది సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రీమింగ్ కావడం లేదు. ప్రస్తుతం రెంట్ ఆప్షన్ ద్వారా మాత్రమే చూడొచ్చు. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. హ్యూ జాక్‌మన్ రాబిన్ హుడ్ పాత్రలో నటుడిగా తన అనుభవాన్ని మొత్తం చూపించగా, జోడీ కామర్ సాధ్వి పాత్రలో కథకు ఎమోషనల్ ఎలిమెంట్ ను జోడించారు. దర్శకుడు మైఖేల్ సర్నోస్కీ ఈ సినిమాను కమర్షియల్ యాక్షన్‌గా కాకుండా… ఒక యోధుడి చివరి రోజుల కథగా చాలా సహజంగా తెరకెక్కించారు.

రాబిన్ హుడ్ కథ అంటే కేవలం యాక్షన్ మాత్రమే అనుకుంటే ఈ సినిమా మీ అభిప్రాయాన్ని మార్చేస్తుంది. ఇందులో యాక్షన్‌తో పాటు ఒంటరితనం, బాధ, త్యాగం, చివరి వరకు న్యాయం కోసం పోరాడే ఒక యోధుడి మనస్తత్వాన్ని చూపించారు. హ్యూ జాక్‌మన్ నటనను ఇష్టపడే వారికి, పీరియడ్ డ్రామాలు, ఎమోషనల్ యాక్షన్ కథలు ఎక్కువగా చూసేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.

Read Also: థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

Related News

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Big Stories

Advertisement
×