Saifabad: సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ దగ్గర గందరగోళం నెలకొంది. పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ, పీఆర్వో వున్నారు. దీంతో పీఎస్ నుంచి 10 మంది వ్యక్తులు పరుగులు తీసిన సంఘటన కలకలం రేపుతుంది. పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వారున్న విచారణ రూమ్ వరకు కొంత మంది అనుమానితులు వెళ్లారంటూ పీఏ తరుపు లాయర్లు తెలిపారు. దీంతో మాస్క్‌లతో ఉన్నవారిని ఎలా విచారణ రూమ్‌లోకి అనుమతించారంటున్న లాయర్లు పోలీసులను ప్రశ్నించారు.
అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద మొదటి రోజు జరిగిన ఘర్షణ వాతావరణంపై పూర్తి వివరాలను కేటీఆర్ పిఎ, పిఆర్ఓ లను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. దుర్భాషలాటలు, దూషణలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ కేటీఆర్ పిఏ, పిఆర్వోలను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు వివరాలను పోలీసులు రాబట్టారు. దీంతో వీరిద్దరి విచారణ అనంతరం పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు కేటీఆర్ పీఏ, పీఆర్వోలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
Also read: నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్
నోటీసులివ్వ కుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇవ్వాలని న్యాయవాదులు పోలీసుల మద్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎదుట ఘటన ఎలా జరిగిందనే కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్‌లోకి తీసుకెల్లనున్నట్టు పోలీసులు అతని తరుపు న్యాయవాదులకు తెలిపారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. హై కోర్ట్ ఆదేశాలకు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని న్యాయవాదుల ఆరోపణలు చేశారు.
Also read: ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి