E-Paper
Advertisement

Satyavathi Rathod : ప్రలోభాల పర్వం.. హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు..

Satyavathi Rathod : ప్రలోభాల పర్వం.. హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు..
Advertisement

Satyavathi Rathod : తెలంగాణలో ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు ప్రలోభాల పర్వం మొదలైంది. ఈ క్రమంలోనే అడ్డంగా బుక్కయ్యారు మంత్రి సత్యవతి రాథోడ్. ఓటర్లను ఆమె ప్రలోభ పెడుతున్నారంటూ గుడూరు పీఎస్‌లో కేసు నమోదైంది.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొంగర గిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున మంత్రి సత్యవతి ప్రచారం చేశారు. కొంగర గిద్దెలో మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. దీంతో పళ్లెంలో రూ. 4 వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.

Advertisement

మంత్రి మంగళ హారతి పల్లెంలో ఎవరికి… ఎన్ని డబ్బులు వేశారానే విషయాన్ని FST బృందం సభ్యుడు మురళీ మోహన్ విచారణ చేసి నిర్ధారించుకున్నారు. అనంతరం ఓటర్లను ప్రోలోభ పెట్టేందుకు మంగళహారతి పళ్లెంలో డబ్బులు వేశారని… గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మంత్రి సత్యవతి రాథోడ్ పై పలు సెక్షన్‌లతో గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-ఈ, 171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్యూ 188 ఐవోసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×