E-Paper
Advertisement

Special Courts: ఖైదీలకు గుడ్ న్యూస్.. ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిన పనిలేదు!

Special Courts: ఖైదీలకు గుడ్ న్యూస్.. ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిన పనిలేదు!
Advertisement

Special Courts: స్వేచ్ఛ బ్యూరో: ఉగ్రవాద నిరోధక చట్టం, మనీలాండరింగ్, డ్రగ్స్ నిరోధక చట్టం.. ఈ చట్టాల ప్రకారం నమోదయ్యే కేసుల్లో అరెస్ట్ అయ్యారో ఏళ్లకు ఏళ్లు జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గి పోవాల్సిందే. అయితే, త్వరలోనే ఈ పరిస్థితి మారనుంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ప్రతిపాదనల మేరకు ఈ చట్టాల ప్రకారం నమోదైన కేసుల విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. అత్యున్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించి సగం పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న జస్టిస్ సూర్యకాంత్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఏళ్ల తరబడి జైళ్లలో..

ఇలాంటి కఠిన చట్టాల ప్రకారం నమోదయ్యే కేసుల్లో విచారణను వీలైనంత వేగంగా పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అరెస్ట్ అవుతున్న నిందితులు బెయిల్ లభించక, విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి జైళ్లలో ఉండిపోవాల్సి వస్తోందన్నారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ వంటి వారు ఎదుర్కొంటున్న కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Advertisement

నిర్దిష్ట కేసులపై ఆయన నేరుగా స్పందించక పోయినా ఈ సమస్యను అధిగమించడానికి న్యాయవ్యవస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఈ చట్టాల ప్రకారం నమోదయ్యే కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి ఏడాది కాల పరిమితిలోగా విచారణలు పూర్తి చేయడం ప్రారంభిస్తే అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో ఉండాల్సి రావటంపై తలెత్తుతున్న వివాదాలకు తెర పడుతుందన్నారు.

Also read: Road Development: నల్గొండ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. రికార్డు స్థాయిలో నిధులు విడుదల!

క్రిమినల్ కేసులు

Advertisement

ఇక, ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల పెండింగేనని తెలిపారు. దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య ఏకంగా 5.05కోట్లకు చేరిందని చెప్పారు. వీటిలో దాదాపు 1.1కోట్ల సివిల్ కేసులు ఉండగా, 3.9 కోట్ల వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఇక, సుప్రీంకోర్టు సామాన్య ప్రజలకు మరింతగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. నేటికీ చాలామంది సామాన్యులు సుప్రీంకోర్టు అనగానే భయపడుతున్నారని, తమ కేసుల విచారణకు ఏళ్లు పడుతుందేమోనని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మంచి లాయర్లను పెట్టుకోలేమేమోనని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ అపోహను తగ్గించడానికి ఉచిత న్యాయ సహాయం నాణ్యతను పెంచామన్నారు. దీనికోసం సీనియర్ లాయర్లను దీని ఎంపానెల్ చేశామని వెల్లడించారు.

ట్రిబ్యునళ్లపై రిటైర్డ్ జడ్జీలు దృష్టి పెట్టాలి..

జాతీయ హరిత ట్రిబ్యునల్, ఎన్‌సీఎల్టీ, ఐటీఏటీ వంటి ట్రిబ్యునళ్ల పనితీరు, వాటిపై ప్రజల్లో ఉన్న గుర్తింపుపై కూడా సీజేఐ స్పందించారు. కోర్టులపై భారం తగ్గించడానికి, ప్రత్యేక రంగాల వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఈ ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. వీటి విశ్వసనీయతను కాపాడటం చాలా ముఖ్యమన్నారు. అయితే, ఇటీవల సర్వీస్ నిబంధనల్లో వచ్చిన మార్పుల వల్ల రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు ఈ ట్రిబ్యునళ్లకు నేతృత్వం వహించడానికి ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. దేశ సేవగా భావించి ప్రతిభావంతులైన రిటైర్డ్ జడ్జీలు ఈ ట్రిబ్యునళ్ల బాధ్యతలను స్వీకరించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ట్రిబ్యునళ్ల విశ్వసనీయత, న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని చెప్పారు.

Also read: KTR: మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం.. కానీ ఆ పని చెయ్: కేటీఆర్!

Related News

పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపెట్టె మర్చిపోయారు.. హరీష్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు!

Addanki Dayakar: నీకేమైనా మెంటల్ ఎక్కిందా అంటూ.. హరీష్ రావుపై అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్!

కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం

Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ!

బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కమీషన్ ఇస్తేనే బిల్లులు.. కాంగ్రెస్ పాలనపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్!

El Niño: తెలంగాణలో వరి సాగు సగానికి పడిపోనుందా? ఎల్ నినో పై ప్రభుత్వం షాకింగ్ అంచనా..!

Big Stories

Advertisement
×