BigTV English

CM: సీఎంకు షాక్.. కారులో తనిఖీలు.. ఎందుకంటే..?

CM: సీఎంకు షాక్.. కారులో తనిఖీలు.. ఎందుకంటే..?
CM-car-Check

CM: ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సుప్రీం. అధికారులు, పోలీసులంతా సీఎం ఆదేశాల మేరకే పని చేస్తారు. సారు బయటికొస్తే.. ఫుల్ టైట్ సెక్యూరిటీ. ట్రాఫిక్ క్లియరెన్స్. అంతా రెడ్ కార్పెట్ జర్నీ. సీఎం అంటే అట్లుంటది మరి.


కానీ, ఆ సీఎం అలా కాదు. ఆయన రూల్స్ పక్కాగా ఫాలో అయ్యారు. అధికారులు సైతం తమ విధులను తు.చ. తప్పకుండా ఆచరించారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వెంటనే సీఎం బసవరాజ్ బొమ్మై తన అధికారిక కారును ప్రభుత్వానికి అప్పగించేశారు. అప్పటినుంచీ భారీ కాన్వాయ్‌, పోలీస్ పైలెట్ వాహనాలు గట్రా లేవు.

శుక్రవారం బెంగళూరు సమీపంలోని ఘాటి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరారు సీఎం బొమ్మై. అధికార వాహనం లేకపోవడంతో.. తన ప్రైవేట్ కారులోనే వెళ్లారు. కాన్వాయ్, పోలీసుల హడావుడి లేకపోవడంతో.. ఆ కారులో వెళ్తున్నది ముఖ్యమంత్రి అనే విషయం బయటివారికి తెలిసే అవకాశం లేదు.


చిక్కబళ్లాపురలోని ఓ చెక్‌పోస్టు దగ్గర ఆ వాహనాన్ని అపేశారు ఎన్నికల అధికారులు. కారును తనిఖీ చేశారు. కాసేపటికి తెలిసింది వారికి అందులో ఉన్నది సీఎం బసవరాజ్ బొమ్మై అని. తన వాహనాన్ని ఆపినా, తనిఖీలు చేస్తున్నా.. ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు బొమ్మై. పైగా వారికి పూర్తిగా సహకరించారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనంలో అభ్యంతరకరమైనవి ఏమీ కనిపించకపోవడంతో కారు వెళ్లిపోయేందుకు అనుమతించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సీఎం సింప్లిసిటీని అంతా మెచ్చుకుంటున్నారు. అధికారుల పనితీరునూ ప్రశంసిస్తున్నారు.

మరి, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూడగలమా? భారీ కాన్వాయ్ లేకుండా మన ముఖ్యమంత్రులు ఇంటి నుంచి బయటకు వస్తారా? వారి వాహనాలను అధికారులు అడ్డుకుంటారా? నిబంధనల ప్రకారం తనిఖీలు చేస్తారా? అంటూ నెటిషన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×