E-Paper
Advertisement

Boga Shravani: జగిత్యాల బీజేపీలో హైడ్రామా.. శ్రావణి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Boga Shravani: జగిత్యాల బీజేపీలో హైడ్రామా.. శ్రావణి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
Advertisement

Boga Shravani: జగిత్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు సాయంత్రం ఆమె నివాసంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందే పార్టీలోని సీనియర్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు.

ఈ ఘర్షణకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపే అని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్లను విస్మరించి.. కేవలం తన అనుచరులకే టికెట్లు ఇప్పించుకున్నారని కార్యకర్తలు భోగ శ్రావణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయాల వల్లే పార్టీ ఓటమి పాలైందని వారు ఆరోపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు ఆమె ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిరసన కారులను వారించినప్పటికీ ఉద్రిక్తత తగ్గకపోవడంతో.. ఆందోళన చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం.. ఎంపీ రాకముందే ఈ స్థాయిలో ఘర్షణ జరగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం భోగ శ్రావణి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×