E-Paper
Advertisement

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!
Advertisement

Contract Teachers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో డీఎస్సీ-2008 సెకండరీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 1,181 మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

కొత్తగా ఒప్పంద పత్రాలు..

కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.21,99,49,440 బడ్జెట్‌ను కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నెలకు రూ. 31,040 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ పొడిగింపునకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించింది. అభ్యర్థులతో కొత్తగా ఒప్పంద పత్రాలు రాసుకోవాలని నిర్ణయించింది.

హైదరాబాద్ మినహా..

Advertisement

వేతనాలు ఐఎఫ్ఎంఐఎస్-డీబీటీ ద్వారానే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకూడదని స్పష్టంచేసింది. ఖాళీల్లో కొత్త నియామకాలు చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.

Also Read: Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×