E-Paper
Advertisement

BRS Election Campaign : వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేస్తాం..జనగామ సభలో కేసీఆర్..

BRS Election Campaign : వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేస్తాం..జనగామ సభలో కేసీఆర్..
Advertisement

BRS Election Campaign : తెలంగాణ రాష్ట్రం రాకముందు కొత్త జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపించేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్.. సోమవారం జనగామ మెడికల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. తొలుత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే.. ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదని, యువకులంతా పొట్టచేతబట్టుకుని వలస వెళ్లినట్లు చెప్పారన్నారు. ఇప్పుడు బచ్చన్నపేటలో 365రోజులు మంచినీరు ఉంటుందని, కనీస అవసరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చాక ఎంతో మేథోమదనం చేసి.. రాష్ట్రాన్ని అభివద్ధి చేశామని.. దాని ఫలితమే ఇప్పుడు వేలాది లారీల్లో ధాన్యం తరలి వెళ్తోందని కేసీఆర్ తెలిపారు.

Advertisement

తెలంగాణ రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలనే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామని, రైతు వేలిముద్ర లేనిదే.. ఎవ్వరూ వారి భూమి జోలికి వెళ్లలేరని తెలిపారు. అలాంటి ధరణిపోర్టల్ ను తీసి సముద్రంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయని, రైతులకు 3 గంటల కరెంట్ చాలని అన్న కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ ధ్వజమెత్తారు. మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. రైతు భీమా తరహాలోనే వ్యక్తి చనిపోతే రూ.5 లక్షలు వస్తాయని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందజేస్తామన్నారు.

ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ హితవు పలికారు. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి.. ఆలోచించి ఓటు వేయాలని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలిపారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×