BigTV English

Varun Tej Pre Wedding Shoot: మెగా ప్రిన్స్ కోసం అల్లు వారి గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ…

Varun Tej Pre Wedding Shoot: మెగా ప్రిన్స్ కోసం అల్లు వారి గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ…

Varun Tej Pre Wedding Shoot: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి సైలెంట్ గా తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. త్వరలో మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే జరగవలసిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగాయి. అయితే ఇప్పుడు తిరిగి ఆ సెలబ్రేషన్స్ అల్లు ఫ్యామిలి తమ నివాసంలో కాబోయే కొత్త జంట కోసం ఎంతో ఘనంగా పార్టీని ఏర్పాటు చేసి మరి నిర్వహించారు.


ఇటు మెగా ఫ్యామిలీ ,అటు అల్లు ఫ్యామిలీ కాబోయే నూతన వధూవరుల కోసం ప్రతి ఫంక్షన్ ని ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సినీ రంగానికి సంబంధించిన ఎందరో గెస్ట్ లను ఆహ్వానించారు. ఈ పార్టీకి మెగా కుటుంబంతో పాటు హీరో నితిన్ తన భార్య షాలినీ తో కలిసి వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలువురు సన్నిహితులు కూడా ఈ పార్టీలో సందడి చేశారు.

ప్రస్తుతం ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ అల్లు శిరీష్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. త్వరలో వరుణ్ లావణ్య పెళ్లి జరుగుతున్న సందర్భంగా మా ఇంట్లో వాళ్ళిద్దరి కోసం గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేయడం జరిగింది అని ఫోటోతో పాటు పోస్ట్ కూడా పెట్టాడు. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికి బాగా ట్రెండ్ అవ్వడంతో పాటు ఫుల్ వైరల్ అయింది. మెగా ఫ్యాన్స్ కాబోయే కొత్త దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.


మిస్టర్ మూవీలో కలిసి వర్క్ చేసిన లావణ్య ,వరుణ్ మొదట బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. తర్వాత ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అంతరిక్షం మూవీ షూటింగ్ సమయంలో మెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆలోచనలు, అభిరుచులు రెండు కలవడంతో మనసులో కలవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే ఎక్కడ ఎన్ని పుకార్లు వచ్చినా ఈ జంట మాత్రం తమ ప్రేమ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించకుండా జాగ్రత్త పడ్డారు.

ఒకరోజు సడన్ గా తమ రిలేషన్షిప్ ప్రకటించి ఇరు కుటుంబాలతో మాట్లాడి సింపుల్గా నిశ్చితార్థాన్ని కూడా జరిపించేసుకున్నారు. అయితే ఈ మెగా ప్రిన్స్ పెళ్లి ఎంతో వైభవంగా జరగనుంది.. మంచి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా. ఇంతకీ వెన్యూ ఎక్కడో కాదు ఇటలీలోని టస్కాలో వీళ్ళిద్దరూ ఏడడుగులు నడవనున్నారు. ఈ నవంబర్ ఒకటవ తారీఖున ఇటలీలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది అని ఒక పక్క ప్రచారం సాగుతోంది కానీ ఇంకా మెగా కాంపౌండ్ నుంచి దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇక వరుణ్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం అతను ఆపరేషన్ వాలైంటైన్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×