BigTV English

Raithu Runamafi: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

Raithu Runamafi: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

Raithu Runamafi: తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్టు డేటాబేస్ ఆధారంగా అర్హులను గుర్తించనున్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.


పంట రుణమాఫీ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ విడుదల చేస్తారు. ఎన్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతులకు సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాకుండా రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. మరిన్ని వివరాకు పోర్టల్ కూడా చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాను కూడా సంప్రదించవచ్చు.

పథకం అమలుకు ఏర్పాట్లు..


  • వ్యవసాయ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించారు.
  • హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏ పథకానికి ఐటి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
  • వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్ నిర్వహించనున్నారు. ఈ ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
    ప్రభుత్వం పేర్కొన్న మరికొన్ని విషయాలు..
  • ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారినిబ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి.
  • బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులకు, ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
  • ప్రతి బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు పంట రుణాల డేటా డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.

Also Read: రైతురుణ మాఫీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్‌

  • ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్-1 మెమో, జత చేసి ప్రోఫార్మా -1లో డిజిటల్ సంతకం చేసి దీని ప్రభుత్వానికి సమర్పించాలి.
  • వ్యవసాయ సహకార సొసైటీలు ఎస్ఐసిలో లేవు. కాబట్టి డిఏసిఎస్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్-2 , జతచేపట్టిన ప్రోఫార్మా-2లో డేటాను డిజిటల్ గా సంతకం చేసి సమర్పించాలి.

 

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×