Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది.. ఉదయం అంతా ఎండగా ఉండి సాయంకాలం సమయంలో ఒక్కసారిగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు నుంచి రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒకవైపు ఎండకోడుతూనే మరో వైపు కుండపోత వర్షం పడుతుంది.
తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తం..
నేటి నుంచి తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఈ యాదాద్రి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని… అలాగే పలు ప్రాంతాల్లో పిడుగుల పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు వెళ్లకూడదని.. అలాగే ఆఫీసులకు వెళ్లిన వారు త్వరగా ఇంటికి చేరుకోవాలని అధికారులు తెలిపారు..
Also Read: ముగిసిన మంత్రులు వివాదం.. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం..
ఏపీలో వాతావరణం ఇలా..
బంగళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో కూడా మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. ఏపీలో చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయవాడ, కాకినాడ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలిపారు.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్య కారులు మరో నాలుగు రోజులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.