Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు.. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జిల్లా అధ్యక్షులకు పంపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తొలి విడత నామినేషన్లు గురువారం నుంచి మొదలుకానున్నాయి. తొలి రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ముగ్గురు పిల్లలున్నా
ఎందుకంటే ముగ్గురు పిల్లల నిబంధన అభ్యర్థులను కలవరపెడుతోంది. అయితే దీన్ని నుంచి కొందరికి మినహాయింపులు లేకపోలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు ముగ్గురు పిల్లల నిబంధన అడ్డంకిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. తెలంగాణలో మాత్రం పాత నిబంధనను కంటిన్యూ సాగిస్తున్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు. ఈ కారణంగానే చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కఠిన నిబంధన నుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు లేకపోలేదు. చట్టంలోని కొన్ని వెసులుబాటు ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కొందరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అలాంటివారు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
1995 మే 31కి ముండు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్నవారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఆ తేదీ తర్వాత మూడో సంతానం ఉన్నవారు అనర్హులవుతారు. 1995 మే 31 కు ముందు ఒక సంతానం ఉండి ఆ తర్వాత కాన్పులో కవలలు పుట్టినా వారు పోటీకి అర్హులే అవుతారు. అదే తేదీకి ముందు కవలలు పుట్టి తర్వాత మరొకరు పుడితే మాత్రం అనర్హులు.
1995 జూన్ 1 తర్వాత రెండో కాన్పులో కవలలు పుట్టినా లేకుంటే ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా వారు పోటీకి అర్హులు. అయితే నామినేషన్ల పరిశీలన నాటికి ముగ్గురు పిల్లలలో ఒకరు మరణిస్తే, ప్రస్తుతం ఉన్న పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అర్హత కల్పిస్తారు. నామినేషన్ల పరిశీలన సమయానికి ఇద్దరు పిల్లలున్న అభ్యర్థి గర్భవతిగా ఉన్నా పోటీకి ఎలాంటి సమస్య ఉండదు.
ALSO READ: నల్గొండ జిల్లా హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం
ప్రస్తుతం ఉన్న సంతానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ తరహా మినహాయింపులతో కొంతమందికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించనుంది. చాలామంది ఈ నిబంధన వల్ల స్థానిక సంస్థల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చాలామంది మాత్రం ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగించి ఎన్నికలు పెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.