Big Stories

Indravelli Stupa : నాటి నెత్తుటి చరిత్ర.. నిలువెత్తు సాక్ష్యం.. ఇంద్రవెల్లి స్థూపం..

Indravelli Stupa : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. స్మృతి వనం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఇంద్రవెల్లిని సందర్శించారు. స్మృతివనం ఏర్పాటు కోసం గిరిజన పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అలాగే దీనిపై నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపనున్నారు జిల్లా అధికారులు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఆదివాసి సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు .

- Advertisement -

సరిగ్గా 42 ఏళ్ల క్రితం 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో అమాయక ఆదివాసీలు తూటాలకు బలైయ్యారు. తాము పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఇంద్రవెల్లి సభకు పిలుపునిచ్చారు. తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఈ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. ఈ సభకు తొలుత పోలీసులు అనుమతిచ్చారు. కానీ చివరి క్షణంలో సభకు ఇచ్చిన పర్మిషన్ వెనక్కు తీసుకున్నారు. ఈ విషయం తెలియని గిరిజనులు ఇంద్రవెళ్లికి భారీగా తరలివచ్చారు. అడ్డుకునేందుకు పోలీసుబలగాల రంగంలోకి దిగాయి. గిరిజనులపై తూటాల వర్షం కురిపించారు. ఎంతో మంది అడవిలోనే ప్రాణాలు వదిలారు.

- Advertisement -

ఇంద్రవెల్లి కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ ఘటనలో13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. పీయుడీఆర్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ 60 మంది ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించింది. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. నాటి మారణహోమానికి గుర్తుగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 1986 మార్చి 19న దుండగులు ఈ స్థూపాన్ని పేల్చివేశారు. ప్రజాసంఘాలు, గిరిజనుల పోరాటంతో 1987లో ఐటీడీఏ నిధులతో తిరిగి స్థూపాన్ని నిర్మించారు.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News