Big Stories

L.R.Eswari Birthday Special : పాటలతో మాయ చేసి మనసు దోచే .. ఎల్ఆర్ ఈశ్వరి బర్త్‌డే స్పెషల్..

L.R.Eswari Birthday Special

L.R.Eswari Birthday Special : “మాయదారి సిన్నోడు .. మనసే లాగేసిండు ..” ఇప్పటికీ మనసుని ఎటో తీసుకుపోయే ఈ మాస్ బీట్ సాంగ్.. దానికి జ్యోతిలక్ష్మి డాన్స్ ఎవర్గ్రీన్ అనడంలో డౌట్ లేదు. ఇటువంటి క్రేజీ సాంగ్స్ తో పాటు మరెన్నో సుమధుర గానాలను అందించిన లెజెండరీ సింగర్ ఎల్.ఆర్.ఈశ్వరి.

- Advertisement -

రసికుల మనసులు తన గాత్రంతో కట్టిపడేస్తుంది కాబట్టే ఆమెకు ‘స్వరభాస్వరం’ అనే పేరు వచ్చింది. తెలుగులో కూడా అనేక పాటలకు గాత్రమందించిన ఈశ్వరి నేటికీ అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశారు. ఆమె గళంలో మత్తో.. లేక గమ్మత్తో తెలియదు కానీ ఒక్కసారి ఆమె పాట విన్నవారు ఆమెను ఎప్పటికీ మర్చిపోలేరు.

- Advertisement -

లూర్డ్ మేరీ రాజేశ్వరి అలియాస్ ఎల్.ఆర్.ఈశ్వరి 1939 , డిసెంబర్ 8న జన్మించారు. తమిళ్ చిత్రాల్లో గ్రూప్ సింగర్ గా తన జీవనాన్ని ప్రారంభించిన ఆమె తరువాత కోరస్ సింగర్ గా ఎదిగారు. ఆమెలోని గాయని మొదటిగా గుర్తించిన వ్యక్తి ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారు.

తెలుగులో 1958లో వచ్చిన దొంగలున్నారు జాగ్రత్త సినిమాలో కె.వి.మహదేవన్ సంగీతంలో తొలిపాట పాడారు. సువర్ణ సుందరి చిత్రంలో పిలవకురా ..అలుగకురా.. పాటకు కోరస్ అందించారు ఈశ్వరి. ఆ తర్వాత క్రమంగా ఐటమ్ సాంగ్స్ కి ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆనాటి మేటి ఐటమ్ సాంగ్స్ హిట్ అవ్వాలి అంటే జ్యోతిలక్ష్మి డాన్స్ తో పాటు ఈశ్వరి గొంతు కలవాల్సిందే.

అలాగే జానపద చిత్రాలకి కూడా ఈశ్వరి గాత్రం అందించారు. నిజజీవితంలో ఆమె ఎన్నో భక్తి పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. మొదట్లో ఐటెం సాంగ్స్ పాడుతుంది అని ఆమెను చిన్నచూపు చూసినవారే ఆ తరువాత ఆమె పొందాలో పాటలు పాడి జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నించారు. పాటలు పాడడంతో పాటు ఈశ్వరి కొన్ని సినిమాలలో కూడా కనిపించి సందడి చేశారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన కిక్ మూవీను.. ‘తిల్లాలంగడి’అనే పేరుతో తమిళ్ రీమేక్ చేశారు. ఈ మూవీలో ఒక సీన్లో ఎల్.ఆర్. ఈశ్వరి నటించారు. అలాగే నయనతార అమ్మవారి పాత్రలో కనిపించిన ‘మూకుత్తి అమ్మన్’లోనూ ఈమె నటించారు. ఈ మూవీని అమ్మోరు తల్లి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం 1984 లో కళైమామణి అవార్డును అందజేసింది. తన గాత్రంతో పాటలకు ప్రాణం పోసిన ఎల్.ఆర్.ఈశ్వరి కి బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News