E-Paper
Advertisement

Hamsa Nandini : టాలీవుడ్ వయ్యారి హంస .. హంసా నందిని బర్త్ డే స్పెషల్ ..

Hamsa Nandini : టాలీవుడ్ వయ్యారి హంస .. హంసా నందిని  బర్త్ డే స్పెషల్ ..
Advertisement
Hamsa Nandini

Hamsa Nandini : హంసా నందిని.. నిజంగా హంసను తలపించే అందంతో.. ఇట్టే ఆకర్షించే చక్కటి నటి. గోపీచంద్ లౌక్యం మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జక్కన్న తెరకెక్కించిన నాని ఈగ మూవీలో నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం వంశీ డైరెక్షన్లో వచ్చిన అనుమానాస్పదం మూవీ. ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో కూడా బ్యాంక్ ఎంప్లాయ్ గా హంసా..యాక్షన్ నవ్వుల పువ్వులు పూయించింది.

ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో మంచి రోల్స్ చేసి సాలిడ్ గా సెటిల్ అయింది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో డిస్కో సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ కాకపోయినా.. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో ఉన్న కాసేపు స్క్రీన్ ని తన అందంతో వేడెక్కిచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పైకి నవ్వుతూ చలాకీగా కనిపించే హంస ఒకానొక సందర్భంలో బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి గెలిచింది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

Advertisement

రెండేళ్ల పాటు క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడిన హంస.. తన దృఢ సంకల్పంతో క్యాన్సర్ని సైతం ఓడించి తిరిగి సినిమా షూటింగుల్లో జోరుగా పాల్గొంటుంది. హంసా నందిని..1984 డిసెంబర్ 8న పూణేలో పుట్టింది. మోడలింగ్ పై మక్కువతో ముంబై చేరుకుంది. ఆమె అసలు పేరు పూనమ్ .. అయితే హంసా నందిని అనే పేరుని ఆమెకు పెట్టింది మాత్రం వంశి.. ఆ తర్వాత మంచిగా ఆఫర్స్ రావడంతో ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది.

మొదట్లో మిర్చి, భాయ్ ,అత్తారింటికి దారేది ,రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది హంసా. తెలుగుతో పాటుగా తమిళ్ ,కన్నడ సినిమాల్లో కూడా నటించినప్పటికీ..హంసా.. టాలీవుడ్ లో సాలిడ్ గా సెటిల్ అయిపోయింది. తెలుగువారి బ్యూటిఫుల్ హంస.. హంసా నందిని కి బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×