BigTV English

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

CM Revanth Reddy to leave for Delhi: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఢిల్లీకి మరోసారి వెళ్లనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద పలు అంశాలపై చర్చలు జరపనున్నారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుతోపాటు పలు అంశాలపై పార్టీ అధిష్టానంతో సీఎం, మంత్రులు చర్చలు జరిపే అవకాశమున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: మరుగుదొడ్డిలోనే మల్లమ్మ నివాసం.. చలించిపోయిన సీఎం రేవంత్

అయితే, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. కానీ, సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా నామినేటెడ్ పదవులకుసంబంధించి ఇప్పటికే పలువురి పేర్లతో ఓ జాబితాను రెడీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also Read: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

Related News

Red Alert: అత్యంత భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు.. ఏ జిల్లాలకంటే..?

Rain update: అత్యంత భారీ వర్షాలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి..!

KTR Bandi Sanjay Meet: బండి సంజయ్, కేటీఆర్‌లను కలిపిన వరద.. ఇద్దరి మాటలు వింటే నవ్వులే నవ్వుల్

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Big Stories

×