BigTV English
Advertisement

BC Caste Census: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

BC Caste Census: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

BC Caste Census: బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. కుల గణనను చేపట్టాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోపు బీసీ కుల గణన చేపట్టి, కుల గణనకు సంబంధించి నివేదిక సమర్పించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, రాష్ట్రంలో బీసీ కుల గణనను చేపట్టాలే ఆదేశించాలంటూ హైకోర్టులో 2019లో పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘానికి చెందిన నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేసింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని పిటిషనర్ పేర్కొనగా, అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి, పిటిషన్ పై విచారణను ముగించింది.


Also Read: సాగర్ చుట్టూ బారికేడ్లు.. గణపయ్య నిమజ్జనానికి దారేది ?

ఇదిలా ఉంటే.. బీసీ కులగణనపై చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర సర్కారు ముందు నుంచి చెబుతూ వస్తున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా చేస్తూ వస్తున్నది. బీసీ కుల గణనను పూర్తి చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉందుటున్నారు రాజకీయ నిపుణులు. అందుకు అనుగుణంగానే ఇటీవలే రాష్ట్ర బీసీ కమిషన్ కు కొత్తగా చైర్మన్ ను, కొత్త సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కూడా బీసీ కుల గణనపై కాంగ్రెస్ పార్టీ గానీ, రేవంత్ రెడ్డి గానీ సుముఖత వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. కుల గణన పూర్తి అయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మూడు నెలల్లోగా క్యాస్ట్ సెన్సెస్ ను కంప్లీట్ చేయాలని హైకోర్డు ఆదేశించడం గమనార్హమంటున్నారు.


Also Read: తెలంగాణ.. ది ఫ్యూచర్ స్టేట్.. 16వ ఆర్ధిక సంఘం భేటీలో సీఎం రేవంత్

ఇటు బీసీ కుల సంఘాల నాయుకులు కూడా ఎన్నో రోజుల నుంచి ఈ అంశంపై ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టి బీసీల జనాబా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. బీసీ కుల గణన విషయంలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి బీసీలు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల పరంగా నష్టపోతున్నామంటూ చాలా సందర్భాల్లో బీసీలు రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు. ఢిల్లీకి సైతం వెళ్లి పార్లమెంటు భవనం ముందు కూడా దీక్ష కూడా చేపట్టారు. బీసీల కుల గణన చేపట్టిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే బీసీలకు సరైన న్యాయం దొరుకుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గతంలో మాదిరిగానే నష్టపోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన తమకు అన్నిరంగాల్లో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Related News

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..! మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం..

Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న ప్రమాదాలు.. 12 రోజులుగా

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి, బిడ్డ ఫొటో..

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. పెరుగుతోన్న మృతుల సంఖ్య, సీఎం రేవంత్​‌రెడ్డి కీలక ఆదేశాలు, కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు

Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలు..!

Seethakka: నెద‌ర్లాండ్ లో మంత్రి సీత‌క్క ప‌ర్య‌ట‌న‌, ఘన స్వాగతం ప‌లికిన‌ తెలుగు వాసులు

Jubilee Hills Bypoll: సొంత నేతలపై బీఆర్ఎస్ నిఘా..

Big Stories

×