EPAPER

Tollywood Heroes: ఇప్పటివరకు రాజమౌళి సెంటిమెంట్ తో బలి అయిన హీరోలు వీరే..

Tollywood Heroes: ఇప్పటివరకు రాజమౌళి సెంటిమెంట్ తో బలి అయిన హీరోలు వీరే..

Tollywood Heroes: దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు కూడా తరువాత హిట్ దక్కింది లేదు. జక్కన్న తో సినిమా చేసిన ఏ హీరో అయినా తన తదుపరి సినిమాపై ఆశలు వదిలేసుకోవడమే.


ss-rajamouli-stills-photos-pictures-02

టాలీవుడ్ దీన్నే రాజమౌళి సెంటిమెంట్ అని పిలుస్తున్నారు . ఇప్పటివరకు ఈ సెంటిమెంట్ దాటి హిట్ అందుకున్న హీరో లేడు. జక్కన్న స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ అందుకోగలడు..   చిన్న చిన్న హీరోలతో తీసి కూడా హిట్ అందుకోగలడు.


baahubali2-press-meet-60

ఇప్పటివరకు ఆ సెంటిమెంట్ ను ఏ హీరోలు దాటలేకపోయారు. మరి గతంలో రాజమౌళితో సినిమా చేసి ఏళ్లకు ఏళ్లు ప్లాపులను అందుకొని హిట్ కొట్టడానికి కష్టపడిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Jr-NTR-1-1080x1440-1

రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి.  స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాల మధ్య  ఎన్టీఆర్ ఎన్నో ప్లాపులను అందుకున్నాడు. ప్లాపుల నుంచి బయటపడడానికి మధ్యలో ఎన్టీఆర్.. జక్కన్ననే ఎంచుకొని  ఆయనతోనే సినిమాలు చేశాడు.

 

రాజమౌళి- నితిన్ కాంబోలో సై సినిమా వచ్చింది.  ఈ సినిమా రిలీజ్ అయిన ఏడేళ్లకు ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు నితిన్. నిజం చెప్పాలంటే ఈ ఏడేళ్లలో నితిన్ కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు కూడా. ఇక నితిన్ గురించి చెప్పాలంటే.. ఇష్క్ కు ముందు ఇష్క్ తరువాత అని చెప్పుకొస్తున్నారు.

MV5BZWI4OWJiY2ItOTA1Mi00YmYxLWFhZWItZDcwOGY2M2RhN2EwXkEyXkFqcGc@._V1_

రాజమౌళి –  ప్రభాస్ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఛత్రపతి, బాహుబలి1, 2. ఛత్రపతి తరువాత ఐదేళ్లకు ప్రభాస్ కు డార్లింగ్ తో హిట్ పడింది. బాహుబలి 1,2 తరువాత.. మళ్లీ కల్కితోనే అంతటి విజయాన్ని అందుకోగలిగాడు.

ravi-teja-mumbai-promo7

రాజమౌళి- రవితేజ కాంబోలో విక్రమార్కుడు వచ్చింది. రవితేజ కెరీర్ లోనే  గుర్తిండిపోయే చిత్రాల్లో విక్రమార్కుడు ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయిన  రెండేళ్లకు కృష్ణ సినిమాతో హిట్ అందుకున్నాడు రవితేజ.

r1-jpg

రాజమౌళి- రామ్ చరణ్ కాంబోలో మగధీర వచ్చింది. చిరుతతో చరణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా మగధీరనే అతనికి లైఫ్ ఇచ్చింది.  ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లకు ధృవ సినిమాతో హిట్ అందుకున్నాడు చరణ్.

Hero-Sunil-Photos-88f5981f5d5ec253ed73dc149fa3211083

రాజమౌళి – సునీల్ కాంబోలో మర్యాద రామన్న వచ్చింది. కమెడియన్ తో కూడా సినిమా తీసి హిట్ అందుకున్నాడు జక్కన్న. అందాల రాముడు సినిమాతో హీరోగా పరిచయమైన  సునీల్ కు మర్యాద రామన్న హీరోగా నిలబెట్టింది. కానీ,  ఈ సినిమా రిలీజ్ అయిన ఏడేళ్లకు కానీ సునీల్  మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ  ఇచ్చి ట్రాక్ లోకి రాలేదు.

nani_170685406220

రాజమౌళి – నాని కాంబోలో ఈగ వచ్చింది. ఈ సినిమాలో   నాని నటించింది కొద్దిసేపే అయినా కూడా జక్కన్న సెంటిమెంట్ అతన్ని కూడా వదలలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన  మూడేళ్లకు భలే భలే మగాడివోయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మరోసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ ను వెంటాడుతుంది.. ఈ ఇద్దరు హీరోలతో జక్కన్న ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీస్టారర్ చేశాడు. ఈ సినిమా తరువాత  చరణ్ గేమ్ ఛేంజర్ తో, ఎన్టీఆర్ దేవర తో రాబోతున్నారు. మరి  ఈ సెంటిమెంట్ ను  ఈ హీరోలు బ్రేక్ చేస్తారేమో చూడాలి.

Related News

Pooja Hegde: శ్రీలంకలో పూజా పుట్టినరోజు సంబరాలు.. ఫోటోలు చూస్తుంటే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొస్తుంది కదూ!

Pranitha Subhash: వాహ్.. తలుక్కున మెరుస్తున్న ప్రణీత సుభాష్

Ayesha Khan: ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న ఆయేషా ఖాన్..

Amala Paul: కొడుకు ఫోటోలను షేర్ చేసిన అమలా పాల్.. ఎంత క్యూట్ ఉన్నాడో!

Nidhhi Agerwal: స్కూల్ పిల్లలాగా రెడీ అయిన నిధి.. సో క్యూట్ అంటున్న ఫ్యాన్స్

Hebah Patel: “నీలిరంగు చీరలోన.. చందమామ నీవే జాన”.. హెబ్బా అందాలు చూడతరమా..

Priyanka Jawalkar: యూత్‌ని మత్తు ఎక్కించే లుక్‌‌లో ప్రియాంక జవాల్కర్

Big Stories

×