BigTV English

Hansika: భర్తకు విడాకులు.. సింగిల్ గా వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఇలా కన్ఫాం చేసిందా?

Hansika: భర్తకు విడాకులు.. సింగిల్ గా వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఇలా కన్ఫాం చేసిందా?

Hansika Motwani Divorce: హీరోయిన్ హన్సిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన పర్సనల్ లైఫ్ పై బి టౌన్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్తకు దూరంగా ఉంటుందని, త్వరలోనే సోహైల్ కతురియాకు విడాకులు ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇక ఆమె తీరు కూడా ఈ వార్తలు నిజమే అన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈమధ్య హన్సిక ఎక్కడికి వెళ్లిన సింగిల్ గా కనిపిస్తోంది. అంతేకాదు ఇన్ స్టాగ్రామ్ నుంచి తన పెళ్లి, భర్త ఫోటోలు డిలీట్ చేసింది. సింగిల్ గానే వెకేషన్స్ కి వెళుతోంది. దీంతో ఆమె విడాకులు వార్తలు నిజమే అన్నట్టుగా గట్టి ప్రచారం జరుగుతుంది.


ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా హన్సిక విడాకులు వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై ఇప్పటి వరకు హన్సిక స్పందించలేదు. ఆమె భర్త సోహైల్ సైతం ఈ విషమై మౌనంగా ఉన్నాడు. ఈ జంట స్పందించకపోవడంతో విడాకులు వార్తలపై అభిమానుల్లో రకరకాల సందేహలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హన్సిక షేర్ చేసిన రీసెంట్ ఫోటోలు ఆమె విడాకుల వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. పెళ్లయినప్పటి నుంచి ఏ పండగైనా, వేడుకైనా భర్త, అత్త మామాలతో సంతోషంగా జరుపుకుంటుంది.వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసుకుని మురిసిపోయేది. కానీ తాజాగా వినాయక చవితి హన్సిక సింగిల్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రతి ఏడాది కరువచౌతి, దసరా, ఉగాది, తన పుట్టిన రోజు వేడుకులను భర్తతో కలిసి భర్త తో కలిసి జరుపుకునేది.

ఈ సెలబ్రేషన్స్ ఆమె తన అత్త మామ, తల్లి కూడా భాగమయ్యేవారు. దీంతో పెళ్లయిన హన్సిక వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఆస్వాదిస్తోందని, భర్త తో ఆమె హ్యాపీ కనిపించడం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉందని అభిమానులంత మురిపిపోయారు. కానీ, తాజాగా ఆమె వినాయక చవితిని భర్త లేకుండ ఒంటరిగా జరుపుకుంది. దీంతో హన్సిక విడాకుల వార్తలు నిజమే అన్న సందేహలు మరింత బలపడుతున్నాయి. మరి దీనిపై హన్సిక నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. కాగా గత కొంతకాలంగా హన్సిక, సోహైల్ కతురియాలో వేరు వేరుగా నివసిస్తున్నారట. సోహైల్ ముంబైలో తన తల్లిదండ్రులతో, హన్సిక తన తల్లి, సోదరుడితో ఉంటుంది. సోహైల్ కుటుంబంలో హన్సిక ఇమిడలేకపోయిందని, ఈ క్రమంలోనే వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది.


హన్సికకు తన తల్లిదండ్రులతో పడటం లేదని, వారితో ఆమె ఇమడలేకపోతుందని సోహైల్ తన సన్నిహితులతో చెప్పుకున్నట్టు సమాచారం. చిన్న చిన్న మొదలైన వారి మనస్పర్థలు.. పెద్దగా మారి ఇప్పుడు విడాకులకు దారి తీశాయని అంటున్నారు. ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందట. దీనిపై తుది తీర్పు వచ్చాక.. హన్సిక, సోహైల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసి హన్సిక ఫ్యాన్స్ వాపోతుంటే.. మరికొందరు.. అది తన కర్మ ఫలం అంటున్నారు. కాగా సోహైల్ హన్సిక బెస్ట్ ఫ్రేండ్ భర్త అనే విషయం తెలిసిందే. తన స్నేహితురాలి ఫ్రేండ్ నే హన్సిక పెళ్లాడింది. స్నేహితురాలితో పెళ్లి సమయంలో సోహైల్ తో హన్సికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో సోహైల్ హన్సిక స్నేహితురాలికి విడాకులు ఇచ్చి తనతో పెళ్లి సిద్దమయ్యాడు. విడాకుల తర్వాత హన్సిక, సోహైల్ కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత 2022 డిసెంబర్ లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మూడేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన వీరు ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యారని తెలిసి వీరి సన్నిహితులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

DUDE First Gear: డ్యూడ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, ఎక్సలెంట్ ఎనర్జీ

OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా 

Big Stories

×