BigTV English

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Elephant video: సోషల్ మీడియాలో మనం అద్భుతమైన వీడియోలను చూస్తుంటాం.. జంతువుల వీడియోలు, కామెడీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  నీటి ఒడ్డున ఆనందంగా స్నానం చేస్తున్న ఏనుగుల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను థాయిలాండ్‌లోని సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లెక్ చైలెర్ట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.


?utm_source=ig_web_copy_link

ఈ వీడియోలో ఏనుగుల గుంపు ఆకుపచ్చని అడవుల మధ్యలో ఉన్న నీటి ఒడ్డున స్నానం చేస్తూ, స్వేచ్ఛగా ఆడుకుంటూ కనిపిస్తాయి. ఈ దృశ్యం మనసును ఆకర్షించేలా ఉంది. ఎందుకంటే ఏనుగులు తమ తొండాలతో నీటిని ఒకదానిపై ఒకటి చల్లుకుంటూ, సంతోషంగా గడుపుతున్నాయి. ఏనుగుల సంరక్షకురాలైన చైలెర్ట్ సమీపంలోనే ఉంటూ.. వారి భద్రతను కాపాడుతూ, ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం ఏనుగులు, మానవుల మధ్య ఉన్న అద్భుతమైన బంధం గురించి తెలియజేస్తోంది.


ఈ ఏనుగుల వీడియోను ‘ఇది బాత్ సమయం’ అనే సరళమైన క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేశారు, ఇది కొన్ని గంటల్లోనే 22,000 కంటే ఎక్కువ వీక్షణలను సాధించింది. ఈ వీడియో ఆనందం మరియు స్వాతంత్ర్యానికి చిహ్నంగా నిలిచింది, ఎందుకంటే ఏనుగులు తమ సహజ వాతావరణంలో సంతోషంగా గడుపుతున్న దృశ్యం దర్శకులను ఆకట్టుకుంది. నెటిజన్లు కామెంట్ల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఈ ఏనుగుల వీడియో అద్భుతంగా ఉంది.. అవ్వి నీటి ఒడ్డున స్నానం చేస్తూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాయి’ అని రాశారు.

ALSO READ: Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!

మరి కొంత మంది ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్ చేశారు. ‘ఏనుగులకు సహజమైన నీటి గొట్టం ఉంది’ అని చమత్కారంగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఏనుగులు వాటి జీవితాన్ని ఉత్తమంగా ఆనందిస్తూ గడుపుతున్నాయి’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇది అసలైన ఆనందం.. ప్రకృతిలో అలా జంతువుల  మధ్య గడపడం నిజంగా గ్రేట్’ అని మరికొంత మంది రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఏనుగులు తమ సహజ ఆవాసంలో ఆనందించే దృశ్యం వీక్షకుల మనసులను ఎలా ఆకర్షించిందో తెలియజేస్తాయి.

ALSO READ: PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

ఈ వీడియో ఏనుగుల స్వేచ్ఛ, ఆనందాన్ని అలాగే మానవులతో వాటి బంధాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది. సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ఈ జంతువుల సంరక్షణ కోసం చేస్తున్న కృషిని ఈ దృశ్యం ప్రతిబింబిస్తుంది. ఈ హృదయ స్పర్శి క్షణాలు ప్రకృతితో మానవుల సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. అందరినీ సంతోషంతో నింపుతాయి.

Related News

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Big Stories

×