E-Paper
Advertisement

Chalo Raj Bhavan Rally: 18న ఛలో రాజ్ భవన్.. భారీ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Chalo Raj Bhavan Rally: 18న ఛలో రాజ్ భవన్.. భారీ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

ఛలో రాజ్ భవన్

⦿ అదానీ, మోదీ బంధంపై కాంగ్రెస్ పోరాటం
⦿ దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆందోళనలు
⦿ రేపు హైదరాబాద్‌లో ఛల్ రాజ్ భవన్ కార్యక్రమం
⦿ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ
⦿ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల హాజరు

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: Chalo Raj Bhavan Rally: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల లోపలా బయటా నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ, ప్రభుత్వం అవేవీ పట్టించుకోవడం లేదు. అయితే, ఈ నిరసనలను దేశవ్యాప్తంగా నిర్వహిచేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీపీసీసీ ఛలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చింది.

భారీ ర్యాలీకి ప్లాన్
18వ తేదీన బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం జరగనుంది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నుంచి రాజ్ భవన్ వరకు ఈ భారీ ప్రదర్శన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇందులో పాల్గొంటారు. అమెరికాలో గౌతమ్ ఆదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలు, దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Advertisement

Also Read: Hyderabad Formula E Case : బీఆర్ఎస్ పార్టీకీ ఎదురుదెబ్బ.. కేటీఆర్ పై పోలీసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ఆదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మనిప్యులేషన్ లాంటి ఆరోపణలు ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అలాగే, మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోదీ సరిగ్గా స్పందించకపోవడం, ఇప్పటి వరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటి అంశాలను నిరసిస్తూ, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తోంది టీపీసీసీ. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొననుండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రానున్నారు

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×