Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో 200మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు.
వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని సమాచారం. తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రయాణికుల్లో చాలామంది వియత్నాం పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులే ఉన్నార. ఇప్పుడు వారి షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికుడు “రాత్రంతా పడిగా పడుకున్నాం, ఆహారం కూడా సరిగా దొరకలేదు.
ఎయిర్‌లైన్స్ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు” అని ఫిర్యాది చేశారు. ఈ ఆలస్యం వల్ల ప్రయాణికులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలు కూడా ఆందోళన చెందారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలాంటి ఆలస్యాలు సాధారణం.. కానీ, తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు..
శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం
రాత్రి నుంచి దాదాపు 200 మంది ప్రయాణికుల పడిగాపులు
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
విమానం ఎప్పుడు బయలుదేరుతుందో స్పష్టం చేయని ఎయిర్‌లైన్స్ సిబ్బంది pic.twitter.com/pn9f3Cm2Eu
— BIG TV Breaking News (@bigtvtelugu) November 8, 2025