భారత్ భూకంపాలు ఎందుకు సంభవిస్తుంటాయి అనే విషయంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరిగాయి. సహజంగా భూకంపాలు భూమి పొరల్లో సర్దుబాట్ల వల్ల జరుగుతుంటాయి. అయితే భారత్ లో హిమాలయాలు ఈ కదలికలకు కీలకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హిమాలయాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, వాటి కదలికల వల్ల భూమి అంతర పొరల్లో కూడా మార్పులు జరుగుతున్నాయని, ఆ సర్దుబాట్ల కారణంగానే భూకంపాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై జరిగిన తాజా పరిశోధన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.
ఢీకొంటున్న ప్లేట్ లు..
హిమాలయాలను కలిగి ఉన్న ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్‌తో నిరంతరం ఢీకొనడం వల్ల భూగర్భ ద్రవ్య నమూనాలు మారిపోతున్నాయని, అందువల్ల భూకంపాలు జరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. అయితే పశ్చిమ హిమాలయాల్లో ఈ ప్లేట్ పటిష్టంగా ఉందని, కదలికలు లేకుండా ఉందని, టిబెట్ క్రస్ట్ కింద ఉన్న ప్లేట్ మాత్రం తరచూ కదలికలకు గురవుతోందని తెలుస్తోంది. తూర్పు హిమాలయాల్లో ప్లేట్ క్రస్ట్ నుంచి లిథోస్ఫెరిక్ మాంటిల్ విడిపోయి, ‘అస్థెనోస్ఫెరిక్ విడ్జ్’ ఏర్పడుతున్నట్టుగా ఈ పరిశోధన తేల్చింది. ఈ ప్లేట్లు ఒకదానిపై ఒకటి జరగడం కాకుండా.. వాటిల్లో చీలికలు రావడం, వంకరపోవడం వంటి దృగ్విషయాలను కూడా పరిశోధన గుర్తించింది.
హీలియం ఉద్గారాలతో కచ్చితమైన లెక్కలు..
హీలియం వాయువు ఉద్గారాల ద్వారా జరిగిన లోతైన భూకంపాల అధ్యయనాలతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖండాల ప్లేట్‌లు ఎలా మారిపోతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు లభించినట్టయింది. సూటిగా చెప్పాలంటే హిమాలయాల ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు. ఇండియన్ ప్లేట్ ల మధ్య ఉన్న వ్యత్యాసాల వల్ల హిమాలయాలు ఇంకా ఏర్పాటవుతూనే ఉన్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
చీరుకు పోయి, వంగిపోయిన ప్లేట్ లు..
టిబెట్ లిథోస్ఫియర్ ప్రాంతం నుండి సుతుర్ లైన్ సరిహద్దు దక్షిణాన 100 కిలోమీటర్లు విస్తరించిందని కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది. వాస్తవానికి భూమి పొరలు ఒకదానికి ఒకటి ఒరుసుకుని హిమాలయాలు ఏర్పడ్డాయనే అంచనా ఉంది. అయితే దానికంటే బలమైన ప్లేట్ లు ఒకదానికి ఒకటి చీరుకు పోయి, వంగిపోయి హిమాలయాల ఆకారాల్లో మార్పులు వచ్చాయని, ఆ మార్పులు ఇంకా కొనసాగూతూనే ఉన్నాయని తాజా అధ్యయనం తేల్చింది. అంటే హిమాలయాలు ఇంకా భూమిపై విస్తరిస్తూనే ఉన్నాయి. భూమిలోపల కూడా వాటి ఆకారాల్లో స్పష్టమైన మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ మార్పుల కారణంగానే భూకంపాలు ఏర్పడుతున్నాయి.
భూకంపాల తీవ్రతను వివిధ అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. భూగర్భపు కదలికలు, నీటి వినియోగం, భవన నిర్మాణ ప్రమాణాలు, భూమి అంతర్గత సర్దుబాట్లు, హిమానీ నదాల పరిణామ క్రమం. అయితే తాజా పరిశోధనలు మరించ కచ్చితత్వాన్ని చూపెడుతున్నాయి. 3D సీస్మిక్ ఇమేజింగ్, హీలియం గ్యాస్ ఉద్గారాలు, లోతైన పొరల్లో భూకంపాల భూకంపాల విశ్లేషణ ద్వారా భారతదేశంలో వచ్చే భూకంపాలను విశ్లేషిస్తూ ఎన్నో అనుమానాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్నారు.
ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్‌తో నిరంతరం ఢీకొనడం వల్ల భూ అంతర్గత భాగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఢీకొట్టే ప్రాంతం ప్రదానంగా హిమాలయాల వద్ద ఉంటోంది. తూర్పుతీరం, ఉత్తర-తూర్పు రాష్ట్రాలలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయని రికార్డులున్నాయి. అయితే ప్లేట్ల కదలిక బలంగా ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది.
Also Read: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?