Bigg Boss 9 Telugu Day 64 : ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల రచ్చ మొదలైంది. కానీ తుప్పాస్ నామినేషన్లు కాకుండా ఈసారి హీటు బాగానే పెరిగింది. ముఖ్యంగా జరగవు అనుకున్న కొన్ని విషయాలు జరిగి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాయి. మరి ఈ వీక్ నామినేషన్లు ఎలా జరిగాయి? నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు? అనేది తెలుసుకుందాం పదండి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టారు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న ప్లాస్మా టీవీలో ఉన్న ఫోటోలలో 5 నిమిషాల్లోనే సెలెక్ట్ చేయాలి, అవతలి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కూడా. 3వ సారి కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయేల్ కూడా ఈసారి నామినేషన్లలో పెట్టారు. కానీ తన పవర్ అస్త్రాను వాడుకుని నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యాడు ఇమ్మూ. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాలి. ముందుగా ఇమ్మాన్యుయేల్ ‘ఏదో చూపిస్తాను అనే డైలాగ్ తో హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ అదేమీ కన్పించట్లేదు. కెప్టెన్సీ టాస్క్ లో మిమ్మల్ని పక్కన పెట్టి తనూజాకు ఎందుకు ఇచ్చారు? మీకు కదా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఆమెకు మీరు సపోర్ట్ చేశారు కదా ? అంటూ తన పాయింట్ చెప్పాడు. కానీ భరణి అవును ఆ టైంలో నాకన్నా తనే బెటర్ అన్పించింది అంటూ సరిపెట్టుకున్నారు. ఇక రీతూ దివ్యను నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ నడిచింది. నువ్వు ఇద్దరి ముగ్గురితో గ్యాంగప్ అయ్యి ఉంటావు. నువ్వు చెప్పిందే వాళ్ళు వింటారు. వాళ్ళను మానిప్యులేట్ చేస్తున్నావ్. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఆగు, ఎక్కు అని చెప్పావ్” అంటూ దివ్య దుమ్ముదులిపేసింది రీతూ. వాళ్ళు వింటే నీ ప్రాబ్లెమ్ ఏంటి? నీవల్లే డెమోన్ ఓడిపోయాడు’ అంటూ స్ట్రాంగ్ గానే డిఫెండ్ చేసుకుంది.
నెక్స్ట్ నిఖిల్ ను కళ్యాణ్ నామినేట్ చేశాడు. ‘నేను నిన్నటి లీడర్ బోర్డులో టాప్ 4లో ఉన్నా. భరణి మిగతా వాళ్ళ కంటే టాప్ లోనే ఉన్నా. అంటే అది ఖచ్చితంగా నా గేమ్ ఇంప్రూవ్ అయినట్టే కదా? టాప్ లో కూడా ఉండే ఛాన్స్ ఉందని సమాధానం చెప్పాడు నిఖిల్. ‘అదే కావాలి’ అంటూ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడాడు. అలాగే సుమన్ శెట్టి కూడా నిఖిల్ ను నామినేట్ చేశాడు. తనూజా, దివ్య, సంజన గౌరవ్ ను నామినేట్ చేశారు. నిఖిల్ రీతూను నామినేట్ చేశాడు. సంజనాను ఎమోషనల్ అంటూ గౌరవ్ నామినేట్ చేశాడు. ఇక్కడ హైలెట్ ఏంటంటే స్వయంగా భరణి దివ్యాను నామినేట్ చేశాడు. నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు? బాండింగ్ అనేది నా ఒక్కదాని వల్లే వచ్చిందా?” అంటూ దివ్య ఫైర్ అయ్యింది. చివరగా ఈ వారం నామినేషన్లలో నిఖిల్, రీతూ, గౌరవ్, సంజన, దివ్య, భరణి ఉన్నారు.
Read also : భరణిని బయటకు గెంటే గోల్డెన్ ఛాన్స్ మిస్… ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నాయా పాపా?