OTT Movie : బ్రెజిల్‌ను కుదిపేసిన ఒక కిడ్నాప్ కేసు గురించి ‘ఎలోవా ది హోస్టేజ్’ అనే ఒక డాక్యుమెంటరీ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. 2008లో జరిగిన ఈ రియల్ క్రైమ్ 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఈ దారుణానికి పాల్పడి, మొత్తం దేశాన్నే టెన్షన్ లో పడేసాడు. మరి ఈ రియల్ స్టోరీని చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ డాక్యుమెంటరీ నవంబర్ 12న ప్రీమియర్ అవుతుంది. మరి కొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమ్ లో ఉంటుంది. ఇది ఏ ఓటిటిలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
పారిస్ ఎంట్రెటెనిమెంటో నిర్మించిన ‘ఎలోవా ది హోస్టేజ్: లైవ్ ఆన్ టీవీ’ (Eloá the Hostage: Live on TV) కి క్రిస్ ఘట్టాస్ దర్శకత్వం వహించారు. దీనికి టైనా ముహ్రింగర్, రికీ హిరోకా రచన చేశారు. ఈ డాక్యుమెంటరీ 2025 నవంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది.
2008 అక్టోబర్‌లో బ్రెజిల్‌లో15 ఏళ్ల ఎలోవా అనే టీనేజ్ అమ్మాయిని, ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ లిండెన్‌బర్గ్ అల్వెస్ అనే 22 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. ఆమెను ఒక అపార్ట్‌మెంట్‌లో 100 గంటల పాటు బంధించాడు. లిండెన్‌బర్గ్ గన్‌తో బెదిరించి ఎలోవాను, ఆమె ఫ్రెండ్ నయారాను లాక్ చేసి ఉంచాడు. ఈ కేసు పూర్తిగా టీవీలో లైవ్ ప్రసారం అయింది. బ్రెజిల్ దేశాన్ని కూడా ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూస్ ఛానళ్లు బయట నుంచి లైవ్ కవరేజ్ ఇస్తూ, పోలీస్ నెగోషియేషన్స్ తో నైబర్స్ ని ఇంటర్వ్యూస్ చేశారు. అలాగే లిండెన్‌బర్గ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇంటర్వ్యూ చేశారు. మీడియా సెన్సేషనలిజం వల్ల పోలీస్ ఆపరేషన్ డిస్టర్బ్ అయిందని ఆరోపణలు వచ్చాయి. నయారాను మొదట కిడ్నాపర్ విడుదల చేశాడు కానీ ఆమె మళ్లీ లోపలికి వెళ్లి నెగోషియేట్ చేయడానికి ట్రై చేసింది.
Read Also : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా
చివర్లో పోలీస్ లు రైడ్ చేసి లిండెన్‌బర్గ్‌ను అరెస్ట్ చేశారు. కానీ ఇంతలోనే ఎలోవాను కాల్చి చంపేశాడు. కాకపోతే ఆమె ఫ్రెండ్ నయారా మాత్రం బతికి బయటపడింది. ఈ డాక్యుమెంటరీలో ఎలోవా డైరీలోని ఇంతవరకు రిలీజ్ కాని ఎంట్రీస్, ఆమె బ్రదర్ డగ్లస్, ఫ్రెండ్ గ్రాజియెలీ ఒలివీరా ఇంటర్వ్యూస్, మీడియా ఫుటేజ్‌లు ఉంటాయి. పోలీస్ లు చేసిన మిస్టేక్ లు (స్నైపర్ ఉపయోగించకపోవడం), మీడియా రోల్ (లైవ్ ఇంటర్వ్యూస్ వల్ల రిస్క్ పెరగడం) ఈ మిషన్ ఎలా జరిగిందనేది డీప్‌గా చూపిస్తారు. ఇండియాలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇది ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ లవర్స్‌కు మస్ట్ వాచ్ డాక్యుమెంటరీ.