Brahmamudi serial today Episode: రాజ్ అపాయింట్ చేసిన కొత్త కుక్ స్టెల్లా స్టైలిష్‌గా వస్తుంది. అందరూ ఆమెనే చూస్తుంటారు. ప్రకాష్, రాహుల్ సిగ్గుపడుతుంటారు. రాహుల్ హలో అంటూ పలకరించగానే.. హామ్ మిస్టర్ డిలిషియస్ అంటుంది స్టెల్లా… దీంతో వాడికి డెటిషియస్ అని పేరు పెట్టావు. నాకు ఓ పేరు పెట్టవా..? అని ప్రకాష్ అడగుతాడు. దీంతో పాత చింతపండుతో కలిపిన పులిహోరలా ఉన్నావు నీ పేరు పులిహోర అంటుంది. దీంతో రాహుల్ మా మామయ్య పులిహోర బాగా కలుపుతారు అని అంటాడు. ఇంతలో రాజ్ ఎవరికేం కావాలో చెబితే తాను రెడీ చేస్తుంది అంటాడు. రాహుల్ నాకు ఇటాలియన్ డిషెష్ రెండ చాలు అంటాడు. సుభాష్.. తినడానికి పనికి వచ్చేది. తిన్న తర్వాత ఆరోగ్యాన్ని బాగు చేసేది ఒకటి చాలు అంటాడు.
ప్రకాష్ మాత్రం నాకు నీ చేత్తో ఏం చేసినా చాలు అంటాడు. ధాన్యలక్ష్మీ గుర్రుగా చూస్తుంటుంది. దీంతో స్టెల్లా చూడు పులిహోర మీరు ఏం కోరుకుంటారో నేను అదే చేస్తాను.. ఇంతకీ నా అసిస్టెంట్స్ ఎక్కడ అని అడుగుతుంది. దీంతో రాజ్ షాకింగ్ గా అసిస్టెంట్సా..? అవును ఒకరు డిష్ వాషింగ్ చేస్తారు. ఒకరు వెజిటేబుల్ కట్ చేస్తారు. ఒకరు కుకింగ్‌లో హెల్ప్ చేస్తారు అని స్టెల్లా చెప్పగానే.. వంటకే ముగ్గురు అసిస్టెంట్స్ కావాలంటుంది.. ఇక వాష్ రూం క్లీన్ చేయడానికి ఎంత మంది కావాలంటుందో అని ఇందిరాదేవి అనగానే స్టెల్లా చీచీ అలాంటి పనులు నేనెందుకు చేస్తాను నేను ఓన్లీ కుకింగ్ మాత్రమే చేస్తాను అంటుంది. సరే అయితే ఈ ఒక్క రోజు ఎలాగైనా అడ్జస్ట్ చేసుకో రేపటి నుంచి నీకు ముగ్గురు అసిస్టెంట్స్ ను ఇస్తాను అంటాడు రాజ్. లేదు నేను కుకింగ్ మాత్రమే చేస్తాను. అసిస్టెంట్స్ వచ్చాకే వంట మొదలుపెడతాను అంటుంది.
రాహుల్ మేం ముగ్గురం ఉన్నాము కదా..? అంటూ ప్రకాష్, రాజ్‌ను కలిపి చెప్తాడు. రాజ్, రాహుల్, ప్రకాష్ లను తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది స్టెల్లా.. రాహుల్, ప్రకాష్ ఇద్దరూ కలిసి స్టెల్లాను చెరో వైపు పట్టుకుని ఉంటారు. రాజ్ ఏయ్ వదలండి అంటూ తిడతాడు. కిచెన్ ను చూసిన స్టెల్లా.. కిచెన్ అంతా డర్టీగా ఉంది అంటూ తిడుతుంది. దీంతో ప్రకాష్, రాహుల్ కిచెన్ క్లీన్ చేస్తారు. రాజ్ చేత వెజిటేబుల్స్ కట్ చేయిస్తుంది. స్టెల్లా కూర్చుని అన్ని పనులు ముగ్గురి చేత చేయిస్తుంది. తర్వాత వంట పూర్తి అయిపోయింది. తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తినేయండి అని చెప్తుంది. రాజ్ కోపంగా ఏంటి ఇవన్నీ మేము మోసుకెళ్లి తినాలా..? అంటాడు.
నువ్వే కొసరి కొసరి వడ్డిస్తావనుకున్నాను అంటాడు ప్రకాష్. నీతో కలిసి కూర్చుని లంచ్ చేద్దామనుకున్నాను స్టెల్లా అంటాడు రాహుల్. దీంతో కుకింగ్ సెక్షన్ మాత్రమే నేను చూసుకుంటాను. మిగతావన్నీ ఎవరి వైఫ్స్ తో వాళ్లు చేయించుకోవాలి.. నాకెలాంటి సంబంధం లేదు అని స్టెల్లా చెప్తుంది. దీంతో రాజ్ కోపంగా ఏంటి ఇలా రోజు నీకు ముగ్గురు అసిస్టెంట్స్ తో సర్వం చాకిరి చేయించుకుని పైపైన గరిట తిప్పినందుకు నీకు లక్ష రూపాయలు ఇవ్వాలా..? అవసరం లేదు అంటాడు. దీంతో ప్రకాష్ ఓరేయ్ రాజ్ ఊరుకోరా.. నువ్వలా మాట్లాడితే స్టెల్లా మానేస్తుంది అంటాడు. నీకెందుకు రాజ్ నేను మామయ్య చూసుకుంటాము కదా..? ఆ గిన్నెలేవో మేము పెట్టేస్తాము అంటాడు రాహుల్. ఏదో ఒకటి ఏడవండి అంటూ రాజ్ వెళ్లిపోతాడు.
ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్‌కు తను తీసుకొచ్చిన భోజనాన్ని వడ్డిస్తుంది కావ్య. ధాన్యలక్ష్మీ, స్వప్న డైనింగ టేబుల్ దగ్గర భోజనం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. ఏంటి మా డిషెష్ ఇంకా రాలేదా..? అని అడుగుతాడు. లేదని అటు చూడు రాజ్ అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. కిచెన్ లో ప్రకాష్, రాహుల్ పోటీ పడి మరీ స్టెల్లాతో సెల్ఫీలు దిగుతుంటారు. రాజ్ మా కాపురాలు కూల్చడానికే లక్ష రూపాయలు పెట్టి వంట మనిషిని తీసుకొచ్చావా..? అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇక వేగలేనని రాజ్ వెళ్లి డిషెష్ తీసుకొస్తాడు. ఇంతలో స్టెల్లా వచ్చి నేను చేసిన డిషెష్ పది నిమిషాల్లోనే తినాలని లేకపోతే తినడానికి పనికిరావని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?