E-Paper
Advertisement

Telangana Congress : ఎంపీ పదవులకు ఉత్తమ్, కోమటిరెడ్డి రాజీనామా..? సీఎం అభ్యర్థిపై క్లారిటీ..

Telangana Congress : ఎంపీ పదవులకు ఉత్తమ్, కోమటిరెడ్డి రాజీనామా..? సీఎం అభ్యర్థిపై క్లారిటీ..
Advertisement
Telangana Congress news

Telangana Congress news:

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హస్తిన వేదికగా కీలక భేటీలు జరుగుతున్నాయి. ఢిల్లీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తనకు ఆమోదమేనన్నారు.

ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సీఎం అభ్యర్థి ఎంపిక తోపాటు కేబినెట్ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
డీకేతో చర్చల తర్వాత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక విషయాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖరారు చేస్తారని వెల్లడించారు.

Advertisement

ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తానన్నారు. అలాగే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన కూడా ఎంపీ పదవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×