E-Paper
Advertisement

Wardhannapet Municipality: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కీలక మలుపు.. చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

Wardhannapet Municipality: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కీలక మలుపు..  చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
Advertisement

Wardhannapet Municipality:  వర్ధన్నపేట, బ్యూరో, స్వేచ్ఛ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ముగింపు పలుకుతూ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. చివరి నిమిషం వరకు కొనసాగిన రాజకీయ చర్చలు, లెక్కలు, వ్యూహాత్మక కదలికలు అధికార పార్టీకి అనుకూలంగా మారగా, స్వతంత్రంగా గెలిచిన కీలక కౌన్సిలర్ నేతవత్ షిభారాణి కాంగ్రెస్‌లో చేరడం ఈ ఎన్నికలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచి సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.

Also Read: Madira Municipality: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం.. చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నిక

చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి ఎన్నిక

Advertisement

ప్రారంభంలో సంఖ్యాబలం స్పష్టంగా లేకపోయినా కాంగ్రెస్ నాయకత్వం స్థానిక స్థాయిలో సమన్వయం, స్వతంత్ర సభ్యులతో సంప్రదింపులు జరిపి అవసరమైన మద్దతును కూడగట్టగలిగింది. కాంగ్రెస్ తరఫున మొత్తం 7 ఓట్ల మెజారిటీతో వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి ఎన్నిక కాగా, స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఎక్స్-అఫిషియో ఓటు నిర్ణాయకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

షిభారాణి ఏకగ్రీవం 

అనంతరం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో 5వ వార్డు నుంచి స్వతంత్రంగా గెలిచిన షిభారాణి ఏకగ్రీవ మద్దతుతో వైస్ చైర్మన్‌గా ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఫలితాన్ని జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం పెరుగుతున్న సంకేతంగా విశ్లేషిస్తూ, స్వతంత్ర సభ్యులను ఆకర్షించడంలో సాధించిన విజయం స్థానిక సంస్థల్లో పార్టీ పట్టు మరింత బలపడేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వరకు నెలకొన్న రాజకీయ వేడి ముగియగా ఇప్పుడు పాలన, అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పట్టణ సమస్యల పరిష్కారంపై కొత్త చైర్మన్ ఎలా ముందుకు సాగుతారన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Also Read:High Tension at Thorrur: తొర్రూరులో రాజకీయ సెగ.. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల రణరంగం! 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×