E-Paper
Advertisement

Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ ఫుల్ ఫోకస్!

Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ  ఫుల్ ఫోకస్!
Advertisement

Konda Surekha:  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఆదివారం మధిరలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… కష్ట కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.పై స్థాయి నుండి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పనులు జరుగుతాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు

ప్రతి వార్డుకి ఐదుగురు చొప్పున కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేశారని చెప్పారు. వార్డు లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి కే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తామన్నారు. మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులు మాత్రం అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటారన్నారు. రెండు సంవత్సరాలలో రాబొయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన వారు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

Also Read:Konda Surekha: తప్పు చేయని వారు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు.. కేసీఆర్‌కు నోటీసులపై కొండా సురేఖ క్లారిటీ

గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి

అందుకే ప్రతి ఒక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ((Congress Party))లో గ్రూపులకు తావులేదు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ అన్నారు. పార్టీ సిద్ధాంతాలు కు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని, చైర్మన్ పదవి దక్కించుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 22 వార్డుల్లో గెలిపించి ఇంచార్జి గా వచ్చిన నాకు బహుమతిగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రతి ఒక్కరూ కష్టపడాలి

Advertisement

కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. మధిర మున్సిపాలిటీ లో 22 వార్డులు గెలిపించి భట్టి విక్రమార్క కి బహుమానం గా ఇవ్వాలని కోరారు.

Also Read: Medaram Jatara 2026: వనదేవతల వనప్రవేశం.. వైభవంగా ముగిసిన మేడారం మహా జాతర..

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×