DK Aruna: కొండా సురేఖ బర్తరఫ్ పై పాలమూరు ఎంపీ డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖ సీనియర్ మహిళా నాయకురాలని, కాంగ్రెస్ లోని ఇంటర్నల్ రాజకీయ విభేదాల వల్లే ఆమెను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండవచ్చని ఆమె భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో అనేక గ్రూపులు తగాదాలు ఉంటాయని, కాంగ్రెస్‌లో అవి రోజూ చూస్తునే ఉన్నామన్నారు.
కానీ సురేఖను బర్తరఫ్ చేయడం నిజంగా బాధ కలిగించిందని అరుణ వెల్లడించారు. కొండా సురేఖ సీనియర్ నాయకురాలని, 2009లో ఆమె, తాను మంత్రులుగా కలసి పని చేశామని గుర్తుచేశారు. తోటి మహిళా నాయకురాలు మంత్రిగా తెలంగాణకు సేవలందిస్తున్నారని సంతోషపడ్డామని పేర్కొన్నారు. సురేఖ ఒక బీసీ మహిళ అని, బీసీలకు కాంగ్రెస్ పార్టీ, సీఎం ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
Also read: తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?
తన కూతురు ఏదో మాట్లాడిందని సురేఖపై యాక్షన్ తీసుకోవడం సరికాదని, సమర్థనీయం కాదన్నారు. ఒక మహిళ రాజకీయాల్లో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడటం, ఇంతవరకు రావడమనేది గొప్ప విషయమని అరుణ తెలిపారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇప్పటివరకు బీజేపీలోకి ఆహ్వానించే అటువంటి చర్చలు ఏవీ జరగలేదని అరుణ స్పష్టచేశారు.
Also read: ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?