BigTV English

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

TG Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వరాలజల్లు కురిపిస్తోంది. ఇప్పటికే దసరా బోనస్ కింద సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి సింగరేణి కార్మికులు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సభలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కార్మికులకు మరొక గుడ్ న్యూస్ చెప్పారు.


ఈ సభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల్లో చాలా మంది పేదలు ఉన్నారన్నారు. తమది పేదల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి.. పేదల సంక్షేమానికి అన్ని పథకాలు వర్తించేలా తాము పాలన సాగిస్తున్నామన్నారు. అలాగే సింగరేణిలో కార్పొరేట్ స్కూల్స్ ఏర్పాటు చేసేలా.. ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

మీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా.. విద్యాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణిలో వైద్యానికి సైతం ఎటువంటి కొరత లేకుండా.. కార్మికుల కోసమే కాకుండా.. స్థానికుల కోసం కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


ఇక ఈ సమావేశంలో కార్మికులకు ఇప్పటికే బోనస్ ప్రకటించిన ప్రభుత్వం తరపున.. మరో గుడ్ న్యూస్ కూడా మంత్రులు ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుందని, ఆ కలను సాకారం చేసుకొనడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉంటుందన్నారు. అయితే సింగరేణి కార్మికుల సొంతింటి కలపై త్వరలోనే తాము తీపికబురు అందిస్తామని మంత్రులు ప్రకటించారు.

Also Read: TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

దీనితో సభకు హాజరైన కార్మికులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల ప్రతి విషయంలో సానుకూలంగా ఉంటుందని, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఏదిఏమైనా దసరాకు బోనస్ అంటూ ప్రకటించిన ప్రభుత్వం.. తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని కార్మికులు ఆహ్వానిస్తున్నారు. అలాగే బోనస్ ప్రకటనతో తమకు దసరా పండుగ ముందే వచ్చిందా.. అనే రీతిలో తమ ఇంట సంబరాలు జరుపుకున్నట్లు కార్మికులు తెలుపుతున్నారు. అయితే ఇక కార్మికులకు చెప్పిన విధంగా సొంతింటి ప్రభుత్వం నుండి వచ్చే తీపికబురు కోసం వెయిటింగ్ అంటున్నారు కార్మికులు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×