BigTV English
Advertisement

High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్

High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్

High Court: రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చెరువులు, కుంటలు కనుమరుగవ్వడానికి కారణమైన అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. విచ్చలవిడిగా పట్టాలు జారీ చేయడం వల్లే చెరువులు క్రమంగా మాయం అవుతున్నాయంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖను రద్దు చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా అడవి మల్లెల గ్రామంలోని సర్వే నంబర్లు 11, 12, 13కు సంబంధించిన భూములను కాకతీయ మిషన్ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ.. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. 2016లో సంజీవరెడ్డి సహా మరో ఏడుగురు రైతులు ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. తొమ్మిది ఏళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు ప్రభుత్వం.. కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం పట్ల కోర్టు తీవ్రంగా స్పందించింది.

తొమ్మిది ఏళ్లు గడిచినా కౌంటర్ దాఖలు చేయకపోవడం అంటే ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై గౌరవం లేకపోవడం. కలెక్టర్లు, ఆర్డీవోలు కౌంటర్లు దాఖలు చేయకపోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది అని హై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తరఫున న్యాయవాది ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, కోర్టు ఆక్షేపించింది.


పిటిషన్ తరఫున న్యాయవాది వాదిస్తూ, రెవెన్యూ అధికారులు చెరువు నీటిమట్టం పరిధిని ఏకపక్షంగా పెంచారని, దాని కారణంగా రైతుల సాగు భూములు చెరువులో కలిసిపోయాయని తెలిపారు. చెరువు పరిధిని మార్చే అధికారాన్ని రెవెన్యూ శాఖకు ఎవరు ఇచ్చారు? అది ఇరిగేషన్ శాఖ పరిధి కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ, చెరువులో నీటిమట్టం పెరిగినప్పుడు FTL పరిధి పెరుగుతుంది. ఆ ప్రకారమే మార్పులు జరిగాయి అని వివరించారు. దీనిపై కోర్టు కఠినంగా స్పందిస్తూ, నీటిమట్టం పెంచడం ఏ చట్టం కింద జరిగింది? చెరువులకు సంబంధించిన సరిహద్దులు నిర్ధారించకుండా పట్టాలు ఎలా జారీ చేస్తున్నారు?” అని ప్రశ్నించింది.

హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, చెరువులు, కుంటలు ప్రభుత్వ ఆస్తులుగా మాత్రమే కాకుండా ప్రజల ఆస్తులుగా భావించాలని, వాటిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడిన చెరువులను రెవెన్యూ అధికారులు ప్రైవేట్ భూములుగా మార్చేస్తే ప్రజల ప్రయోజనం ఎక్కడ ఉంటుంది? అని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. చెరువుల హద్దులు నిర్ధారించి వాటిపై ఎటువంటి భూస్వామ్య పట్టాలు జారీ చేయకూడదని, ఇప్పటికే జారీ చేసిన వాటిపై సమీక్ష జరిపి అవసరమైతే రద్దు చేయాలని ఆదేశించింది.

చెరువులు, కుంటలు హద్దులు నిర్ధారించకుండా.. రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతోనే చెరువులు కనుమరుగవుతున్నాయని తెలిపింది హైకోర్టు.

Also Read: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

మొత్తంగా, రెవెన్యూ శాఖ వ్యవహారశైలి దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో వారి పై కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్-బీజేపీలకు నవంబర్ సెంటిమెంట్ మాటేంటి?

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

Big Stories

×