Suhasini Reddy: నేపాల్ మానసవరం టూర్ కు వెళ్లిన హైదరాబాద్ టెక్కీ సుహాసిని రెడ్డి అక్కడ సంభవించిన వరదల అనంతరం అనూహ్యంగా మిస్ అయ్యారు. ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవడం లేదని, తమ బిడ్డ ఏమైపోయిందోనని గత మూడ్రోజులుగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే తాజాగా ఆమె క్షేమంగా ఉన్నట్లు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. నేపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై సుహాసిని సోదరుడు స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.
సుహాసిని క్షేమంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె సోదరుడు లోహిత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. సుహాసిని ఆస్పత్రి నుంచి కాల్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఫ్యామిలీకి గానీ, అధికారులకు గానీ సుహాసిని ఫోన్ చేయలేదని తెలియజేశారు. కాబట్టి బయట జరుగుతున్న వార్తలను నమ్మవద్దని సూచించారు.
Also Read: ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?
కాగా, హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన సుహాసిని ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 19న ఇంటికి వచ్చిన ఆమె.. గత ఆదివారం మానస సరోవరం యాత్రకు వెళ్లారు. సుహాసినితో పాటు ఆమె ఆస్ట్రేలియా ఫ్రెండ్ కలిపి మెుత్తం 29 మంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మానస సరోవరంకు బయలుదేరారు. అయితే నేపాల్ వరద బీభత్సం తర్వాత సుహాసిని కాంటాక్ట్ కట్ అయ్యింది. ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అటు నుంచి సమాధానం లేదు. దీంతో సుహాసినికి ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!