E-Paper
Advertisement

అలాంటి ప్రతిపాదన ఇప్పట్లో లేదు.. ప్రైవేటీకరణ ప్రచారానికి జీహెచ్ఎంసీ చెక్!

అలాంటి ప్రతిపాదన ఇప్పట్లో లేదు.. ప్రైవేటీకరణ ప్రచారానికి జీహెచ్ఎంసీ చెక్!
Advertisement

GHMC Garbage: జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రతిపాదన ఇప్పట్లో ఏమీ లేదని, అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉంటే ముందు మీతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు క్లారిటీ ఇచ్చారు. చెత్త సేకరణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ స్వచ్ఛ ఆటో కార్మికుల సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. దీంతో నగరంలో చెత్త సేకరణకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తుగా స్పందించారు.

కమిషనర్ కర్ణన్..

తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో డ్రైవర్ కార్మికుల యూనియన్ నాయకులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ శుక్రవారం చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లపై చర్చించి సమ్మెను విరమించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. చర్చల్లో ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనే జీహెచ్‌ఎంసీలో లేదని కమిషనర్ స్పష్టం చేసినట్లు కార్మికులు తెలిపారు.

కమిషనర్ హామీ..

Advertisement

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అందిస్తున్న స్వచ్ఛ ఆటోలను వాటిపై పనిచేస్తున్న కార్మికులకే అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, ప్రస్తుతం స్వచ్ఛ ఆటోలపై పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Also read: నా తండ్రి గుర్తింపు కోసం.. డీఎన్‌ఏ టెస్టు చేయించాలని యువకుడు ధర్నా!

నూటికి నూరు శాతం..

Advertisement

ఒక్క ఇళ్లు కూడా మిస్ కాకుండా మీరు నూటికి నూరు శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేస్తే, త్వరలో కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిక్ వాహానాలను కూడా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మకులకే కేటాయిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు కార్మికులు తెలిపారు. స్వచ్ఛ ఆటో కార్మికుల విషయంలో భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా కార్మిక సంఘాల నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.

వారం రోజులుగా నిరసన

స్వచ్ఛ ఆటో కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించకుండా బయట డంప్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సమ్మె మరిన్ని రోజుల పాటు కొనసాగితే నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం పడటంతో పాటు ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు.

కమిషనర్‌ హామీతో సమ్మె విరమణ

కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఇచ్చిన హామీలతో తమ నిరసనను విరమిస్తున్నట్లు స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రకటించారు. శనివారం నుంచి యథావిధిగా ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు దెబ్బతినకుండా జీహెచ్‌ఎంసీకి సహకరిస్తామని తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి ముందస్తుగా చర్చలు జరిపిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వచ్ఛ ఆటో కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. చర్చల్లో తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో డ్రైవర్ కార్మికుల యూనియన్ నాయకులు కాట్రావత్ గోపాల్ నాయక్, సూరన్న, గోపి, హంసరాలు, అర్జున్, శేఖర్, అంజి, శీను, మహానంది, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Also read: రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×