E-Paper
Advertisement

రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!

రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!
Advertisement

Manuguru Murder: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. రాఖీ పండుగ వేళ సొంతూరుకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోదరి చేత రాఖీ కట్టించుకోవాలని వచ్చిన యువకుడ్ని ఓ గ్యాంగ్ కు చెందిన 30 మంది అతి దారుణంగా కొట్టి హత్య చేశారు. దీంతో ఎంతో ఆనందంగా సోదరుడుకి రాఖీ కట్టాలని భావించిన ఆ సోదరి.. చివరికి కన్నీళ్లతో శవానికి కట్టాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నట్లు శివ (28).. రాఖీ సందర్భంగా ఊరికి వెళ్లాడు. అయితే తన వద్ద పనిచేసే సతీశ్ అనే కార్మికుడి సోదరిని మణుగూరు కాందర్(MK) గ్యాంగ్ వేధిస్తుండటంతో గతంలో వారిని శివ హెచ్చరించాడు. దీంతో అప్పటి నుంచి ఆ గ్యాంగ్ శివపై కోపంగా ఉంది.

మాట్లాడుకుందామని పిలిచి..

Advertisement

రాఖీ సందర్భంగా శివ ఊరిలోకి వచ్చాడని తెలుసుకున్న గ్యాంగ్ లీడర్ రమ్మీ అతడి అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని చెప్పి శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్ కు పిలిపించాడు. అప్పటికే 30 మంది గ్యాంగ్ సభ్యులు శివ కోసం ఎంతో కసిగా గ్రౌండ్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. శివ రాగానే ఒక్కసారిగా అతడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణా రహితంగా కొట్టారు.

ఊపిరితిత్తులు పగిలిపోయి..

శివ వెంట వచ్చిన స్నేహితుడు ఉత్తమ్ కుమార్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. పైగా ఉత్తమ్ కుమార్ ను సైతం గ్యాంగ్ సభ్యులు చితకబాదారు. దీంతో అతడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. అయితే మరింత తీవ్రంగా గాయపడ్డ శివ.. గ్రౌండ్ లోనే కుప్పకూలి మృతి చెందారు. మూక దాడిలో అతడి ఊపిరితిత్తులు పగిలిపోయాయని, పక్కటెముకులు సైతం విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.

Advertisement

Also Read: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ

స్థానికులు తీవ్ర ఆగ్రహం..

శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే గ్యాంగ్ లోని పలువురును అదుపులోకి తీసుకొని.. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. అయితే మణుగూరులో ఎంకే గ్యాంగ్ అరాచకాలు పెచ్చుమీరాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్ని అరాచకాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నిత్యం వివాదాలు సృష్టిస్తూ.. స్థానికులపై దాడులకు పాల్పాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 80 మంది ఉండే ఈ గ్రూప్ పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×