Big Stories

Etela: ఈటలకే రివర్స్ కౌన్సిలింగ్!.. పొంగులేటి, జూపల్లి మైండ్‌గేమ్? కాంగ్రెస్ గాలి వీస్తోంది!

Eetala ponguleti jupalli

Etela Rajender Latest News(Telangana Politics): పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జూపల్లి కృష్ణారావు. కొన్ని నెలలుగా డైలీ న్యూస్‌లో ఉంటున్న నేతలు. వీళ్లు బీఆర్ఎస్‌ను వీడటమేంటో గానీ.. ఏ పార్టీలో చేరుతారో తేలకపోవడంతో వారాల తరబడి ఊహాగానాలు నడుస్తున్నాయి. ఓసారి కాంగ్రెస్ అంటారు.. ఇంకోసారి బీజేపీ అని చెబుతున్నారు.. వాళ్లు మాత్రం ఏ పార్టీలో చేరేది చెప్పకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.

- Advertisement -

పొంగులేటి, జూపల్లిల కోసం కాంగ్రెస్ ఓ దఫా గట్టి ప్రయత్నమే చేసింది. ఏకంగా రాహుల్‌గాంధీ టీమ్ ఢిల్లీ నుంచి వచ్చిమరి చర్చలు జరిపింది. ఇక అంతే. హస్తం పార్టీ మళ్లీ ఫాలోఅప్ చేయలేకపోతోంది. అదే బీజేపీ అలా కాదు. అలుపెరగకుండా వాళ్లిద్దరి చుట్టూనే తిరుగుతోంది. చేరికల కమిటీ ఛైర్మన్ తన బలగంతో కలిసి.. ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి వెళ్లి మరీ సుదీర్ఘ చర్చలు జరిపొచ్చారు. ఆ తర్వాత కర్నాటకలో బీజేపీ ఓడిపోవడంతో.. మళ్లీ అలర్ట్ అయ్యారు. ఈసారి హైదరాబాద్‌ శివారు ఓ ఫాంహౌజ్‌తో వన్ టు వన్.. రహస్య సమావేశం నిర్వహించారు. బాబ్బాబూ.. బీజేపీలో చేరండంటూ కాళ్లావేళ్లా పడినంత పని చేస్తున్నారట ఈటల రాజేందర్.

- Advertisement -

ఆయన అంతగా రిక్వెస్ట్ చేస్తున్నా.. వాళ్లిద్దరూ మాత్రం బీజేపీలో చేరేందకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వారికి కాంగ్రెస్ వైపే మనసు లాగేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పదే పదే వారికి ఓపెన్‌ ఆఫర్ ఇస్తున్నారు. అందుకే వారి మనసు ఎలాగైనా మార్చేసి.. కాషాయ కండువా కప్పేసేయాలని ఈటల రాజేందర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. లేదంటే ఆయన ఢిల్లీలో బాగా బద్నామ్ కావాల్సి ఉంటుంది. వీళ్లిద్దరూ బీజేపీలో చేరితేనే.. అధిష్టానం దగ్గర ఈటల ఇమేజ్ మరింత పెరిగేది. అందుకే, ఆయన వారి చేరికను సవాల్‌గా తీసుకున్నారని అంటున్నారు.

అయితే, బీజేపీలో చేరితే ఏం లాభమో ఈటల వాళ్లిద్దరికీ వివరిస్తుంటే.. వాళ్లేమో ఈటలకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారట. కేంద్రంలోని బీజేపీ.. కేసీఆర్ కుటుంబానికి ఎందుకు సాయం చేస్తోంది? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బీఆర్ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ దగ్గర ఉన్న వ్యూహాలేంటి? ఇలా ఈటలను ఎదురు ప్రశ్నిస్తున్నారట పొంగులేటి, జూపల్లి.

ఇక, వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా చేసేందుకు ఈటల రాజేందర్ దాదాపు ప్రతీరోజు వారితో ఫోన్లో మాట్లాడుతున్నారట. అయితే, ఖమ్మంలో బీజేపీకంటే కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉందని.. బీజేపీలో చేరేందుకు వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయని.. పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరే అవకాశమే ఎక్కువగా ఉందంటూ.. తాజాగా ఈటల రాజేందర్ చేతులెత్తేశారు. ఇన్నాళ్లూ వారు కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగానని.. ఇక తనవల్ల కాదన్నట్టు మాట్లాడారు. జూన్‌ 2 లేదా జూన్ 8న పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరుతారంటూ తేల్చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

ఈటల వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ వీస్తోందనే అంశం స్పష్టమవుతోందని అంటున్నారు. ఖమ్మంలో బీజేపీకి బలం లేదని.. ఆ పార్టీ నేతే చెప్పడం ఆసక్తికరం. పొంగులేటి లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్‌లో చేరితే.. ఖమ్మంలో 10కి 10 కన్ఫామ్ అంటున్నారు. అటు, జూపల్లి రాకతో పాలమూరులోనూ హస్తం హవా మరింత వీస్తుంది. ఇటీవలి పీపుల్స్ మార్చ్ సభ గ్రాండ్ సక్సెస్ కావడం అందుకు సంకేతం. అటు, కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే ప్రచారం ఊపందుకుంది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News