E-Paper
Advertisement

Fake Campaign : బిగ్‌టీవీ లోగోతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం.. టార్గెట్ సునీల్ కనుగోలు టీమ్‌..

Fake Campaign : బిగ్‌టీవీ లోగోతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం.. టార్గెట్ సునీల్ కనుగోలు టీమ్‌..

Fake Campaign : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇందుకు బిగ్‌ టీవీ విశ్వసనీయతను వాడుకుంటున్నారు. బిగ్‌టీవీ లోగోను దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ పేరుతో బిగ్‌టీవీ కథనాలు ప్రసారం చేసినట్టు వీడియో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజల్లో బిగ్ టీవీ తెచ్చుకున్న గుర్తింపును క్యాష్ చేసుకోవాలని దుర్మార్గులు పన్నాగం పన్నారు. దీనిపై బిగ్‌టీవీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది.

ఓటమి భయంతో కొందరు చేస్తున్న దుర్మార్గం ఇది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాలి. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించాలి. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించాలి. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారాలతో కాదు. నిజం నిప్పులాంటిది. ఫేక్ వీడియోలతో వచ్చేది పైశాచిక ఆనందమే. అది కూడా తాత్కాలికమే. బిగ్‌టీవీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, విశ్వసనీయతను క్యాష్ చేసుకోవాలని కొందరు చేస్తున్న దుర్మార్గంపై సైబర్ క్రైమ్‌లో యాజమాన్యం ఫిర్యాదు చేయబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా ప్రజారణ పొందుతున్న బిగ్‌టీవీ పేరుతో జరుగుతున్న ఇలాంటి చెత్త ప్రచారాల్ని నమ్మకండి. మా శాటిలైట్‌ ఛానల్ ప్రసారాలను యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు. యూట్యూబ్‌తో పాటు.. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో మాకు అఫిషియల్ అకౌంట్లున్నాయి. వాటిలో కూడా చూడొచ్చు. ఈ విషయం కూడా తెలీని దుర్మార్గులు.. నీచంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

.

.

.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×