E-Paper
Advertisement

War 2 Release Update : వార్ 2 డేట్ ఫిక్స్ .. సమరం ఆ రోజే ఆరంభం..

War 2 Release Update : వార్ 2 డేట్ ఫిక్స్ .. సమరం ఆ రోజే ఆరంభం..
Advertisement
War 2 Release Update

War 2 Release Update : టాలీవుడ్ హీరోల రేంజ్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు పెరుగుతున్న క్రేజ్ దీనికి కారణం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. టాలీవుడ్ హీరోలు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం తో మిగిలిన మార్కెట్లలో కూడా మన హీరోల గిరాకీ బాగా పెరుగుతుంది. అందుకే ఎందరో బాలీవుడ్ యాక్టర్స్ మన చిత్రాల్లో నటించడానికి.. మన వాళ్ళని వాళ్ళ మూవీస్ లో యాక్ట్ చేయించడానికి ఇష్టపడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ కండలవీరుడు హృతిక్ రోషన్ హిట్ మూవీ వార్ సీక్వెల్ గా వస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ ఓ కీలకమైన పాత్ర చేయబోతున్నారు. మొదట వచ్చిన వార్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో దాని సీక్వెల్ ను భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ హై యాక్షన్ డ్రామా మూవీలో ఎన్టీఆర్ సూపర్ ఫైటింగ్ సీన్స్ లో కనిపించబోతున్నట్లు టాక్.

Advertisement

బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ప్రస్తుతం మూవీకి సంబంధించిన ఒక టెస్ట్ షూట్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

ఈ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ,హృతిక్ రోషన్ మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాల షూట్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా ఈ మూవీ ని కంప్లీట్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ అభిమానం నటుడు మరో లెజెండ్రీ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలి అని నందమూరి అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ వార్త కొత్త కిక్ ని ఇచ్చింది.

Advertisement

మోస్ట్ అవైటెడ్ వార్ 2 మూవీ 2025 ఆగస్టు 14న విడుదల చేయడానికి మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు టాక్. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటిస్తారట. ఆగస్టు 14 నుంచి లాంగ్ వీకెండ్ ఉండడం.. రెండో వారం వినాయక చవితి కలిసి రావడంతో.. మూవీ రిలీజ్ కి ఆ డేట్ బ్రహ్మాండంగా ఉంటుందని చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో తారక్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.. కానీ తారక్ అన్న ఏ రోల్ చేసిన అదుర్స్ అంటున్నారు అతని అభిమానులు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×