E-Paper
Advertisement

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ సాధించిన ఫ్యామిలీ సెంటిమెంట్ !

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబం నుంచి పోటీ చేసిన పలువురు నేతలు విజయాన్ని సొంతం చేసుకొని ప్రజల మనస్సును గెలుచుకున్నారు. మరికొందరు ఓటమి పాలయ్యారు.

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ సాధించిన ఫ్యామిలీ సెంటిమెంట్ !
Advertisement

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబం నుంచి పోటీ చేసిన పలువురు నేతలు విజయాన్ని సొంతం చేసుకొని ప్రజల మనస్సును గెలుచుకున్నారు. మరికొందరు ఓటమి పాలయ్యారు.

తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. గజ్వేల్‌లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. తండ్రీ కొడుకులు మైనంపల్లి, రోహిత్‌లు బరిలో నిలిచారు. మెదక్‌లో మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. మల్కాజ్ గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఓటమి పాలయ్యారు.

Advertisement

ఇక.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పటిలాగే పోటీలో నిలిచారు. నల్గొండలో వెంకట్ రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ విజయం సాధించారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో గడ్డం వివేక్ గెలుపొందారు.

ఊహించిన విధంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు విజయం సాధించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు నల్లేరుమీద నడకలా మారింది.

Advertisement

మరోవైపు.. మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి గెలుపొందారు. మల్కాజ్ గిరిలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

ఇంతమందికి ఫలించిన ఫ్యామిలీ సెంటిమెంట్ మైనంపల్లి కుటుంబానికి సగం మాత్రమే పనిచేసింది. మెదక్ నుంచి పోటీచేసిన మైనం పల్లి రోహిత్ గెలుపొందారు. కానీ ఆయన తండ్రి మైనంపట్టి హనుమంతరావు మల్కాజ్ గిరిలో ఓడిపోయారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×