BigTV English

Telangana DGP : తెలంగాణ డీజీపీగా రవిగుప్త నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్!

Telangana DGP : సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్త.. తెలంగాణ నూతన డిజీపీగా నియమితులయ్యారు.

Telangana DGP : తెలంగాణ డీజీపీగా రవిగుప్త నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్!

Telangana DGP : తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంగా డిజీపీ అంజనీకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఒక డిజిపీ స్థాయిలో ఉండి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎన్నికల కమిషన్ ఆయనను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త డిజీపీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్త.. తెలంగాణ నూతన డిజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరి శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.


1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ అయిన రవిగుప్త.. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంజనీకుమార్ స్థానంలో అన్ని అర్హతలు ఉన్న అధికారి అయిన రవిగుప్తను నియమించారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అంజనీకుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీలు మహేశ్‌భగవత్‌, సందీప్‌కుమార్‌ జైన్‌ కూడా కలిశారు. ఇద్దరు అదనపు డీజీలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×