E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. రైల్వే క్వార్టర్స్ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్

Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. రైల్వే క్వార్టర్స్ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లోని లాలగూడలో మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలగూడ ప్రశాంత్ నగర్ కు చెందిన ఏసు(32).. ఈనెల 7న అర్ధరాత్రి బైక్ పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తున్నాడు. అదే సమయంలో తార్నాకలో ఒక మహిళ బస్సుకోసం వేచి చూస్తోంది. ఆమెను గమనించిన ఏసు.. లాలాపేట వరకూ తీసుకెళ్తానని బైక్ ఎక్కించుకున్నాడు.

అక్కడి నుంచి ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితులకు ఫోన్ చేయగా.. వారు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహిళపై ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

Advertisement

అనంతరం మహిళను తార్నాకలో వదిలి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన బాధితురాలు తొలుత మౌనంగా ఉన్నా చివరికి లాలాగూడ పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తార్నాక బస్ స్టాప్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఏసుతో పాటు.. మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్ (19) లను అదుపులోకి తీసుకున్నారు.

.

Advertisement

.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×