Big Stories

Munugode By Poll : ఓటుకు బంగారు నాణెం!.. మునుగోడులో భారీ తాయిలం?

Munugode By Poll : మునుగోడు బై పోల్ కు సమయం దగ్గర పడుతోంది. అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తించగా.. ఇప్పడిక పంపకాలపై దృష్టి పెట్టాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం.. నేరుగా కొందరి ఖాతాల్లోకి సుశి ఇన్ఫ్రా నుంచి డబ్బుల వచ్చిపడటం.. డైలీ మందు, మాంసం ఇంటికి రావడం.. ఇలా ధూంధాంగా ముగిసింది మునుగోడు ఎన్నికల ప్రచారం.

- Advertisement -

మౌకులు మూగబోయాక.. ఇక అసలు పని ప్రారంభించేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి. బయటివాళ్లంతా నియోజకవర్గం వదిలి వెళ్లిపోగా.. చీకట్లో అసలు సంగతి మొదలైంది. అదే ఓటుకు నోటు. ఓటర్లకు డబ్బు పంపిణీ. ఒక్కో ఓటుకు 10 వేల వరకూ ఇస్తున్నారంటూ టాక్. ఏ పార్టీ ఇస్తోంది అంటే.. ప్రధాన పార్టీలన్నీ తమ శక్తి మేర డబ్బు పంచుతున్నాయని తెలుస్తోంది. ఒట్టి డబ్బేనా అంటే.. కాదు కాదు బంగారం కూడా ఇస్తున్నారట. అవును, మునుగోడు ఓటర్లకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గోల్డ్ కాయిన్స్ పంచుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం బంగారం ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి అని పిలుపునివ్వడం బీజేపీని ఉద్దేశించే అంటున్నారు.

- Advertisement -

మోదీ, బీజేపీ ఫోటోతో.. ఒక గ్రాము బంగారు నాణెంను కవర్ లో పెట్టి బీజేపీ అభ్యర్థి ఓటర్లుకు ఇస్తున్నారని చెబుతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కొందరికి ఒక గ్రాము బంగారం ఇస్తుంటే.. కుటుంబానికి తులం బంగారం పంచుతున్నారని మరికొందరు అంటున్నారు. ఇదే నిజమైతే మునుగోడు ఉప ఎన్నిక ఎంత ఖరీదుగా మారిందో?

బీజేపీ, టీఆర్ఎస్ లు ఇప్పటికే వందల కోట్ల ఖర్చు చేశాయనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ఓటర్లకు మందు, విందులతో పాటు గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి గిఫ్ట్ గా కూడా ఇచ్చారట. మరో అడుగు ముందుకేసి.. ఏకంగా కుటుంబానికి తులం బంగారం పంచుతున్నారనే ప్రచారం మరింత కలకలం రేపుతున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ చాలా వెనకాలే ఉందంటున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికే అనుకుంటే.. మునుగోడు బై పోల్ అంతకంటే ఖరీదైన వ్యవహారంగా మారడం సంచలనంగా మారింది. మూడు ప్రధాన పార్టీలకు గెలుపు అత్యంత ప్రాధాన్యం కావడంతో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు డబ్బులు ఖర్చు చేస్తుండటంతో ఓటర్లు ఎటువైపు షిఫ్ట్ అవుతారనే ఉత్కంఠ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News