E-Paper
Advertisement

Nizamabad : ఆర్మూర్ లో భారీ చోరీ.. కిలోన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

Nizamabad : ఆర్మూర్ లో భారీ చోరీ.. కిలోన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..
Advertisement

Nizamabad : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం సాయంత్రం కిలోన్నర బంగారం చోరీ జరిగింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కో ఆపరేటివ్ బ్యాంకు నుండి ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఓ కారులో బంగారాన్ని మహాలక్ష్మి కాలనీలో గల మందిరం వద్దకు తీసుకొచ్చారు.

బంగారు ఆభరణాలను కారులో ఉంచి ఆలయంలో పూజలు చేసి వచ్చేలోగా బంగారం కనిపించలేదు. అనంతరం బాధితుడు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బంగారం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని బాధితుడు తెలిపారు. కాగా డాక్టర్ ఈశ్వర్ చంద్ర గతంలో వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

Advertisement

ప్రస్తుతం ఆర్మూర్ లోని పాత పోలీస్ స్టేషన్ వద్ద మెడికల్ క్లినిక్ ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అవసరం నిమిత్తం బ్యాంకు లాకర్ లో ఉన్న కిలోన్నర బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టుకుని కారులో ఉంచారు. మహాలక్ష్మి మందిరంలో పూజలు చేసేందుకు వెళ్లడంతో అది గమనించిన దుండగులు దానిని కాజేశారు.

విషయం తెలియగానే జిల్లా సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అదనపు సీపీ జయరాం చోరీ జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ తో పాటు జిల్లాలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందంతో.. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కారులో గల వేలిముద్రలను సేకరించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×